‘కోట బొమ్మాళి PS’ నుంచి మొదటి పాట శ్రీకాకుళం జానపదం విడుదల

తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. సోమవారం మొదటి పాటను విడుదల చేశారు.

ఇప్పటికే హుక్ స్టెప్ ద్వారా విడుదల చేసిన పాట ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు రేలారే ఫేమ్ పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ ఆకర్షిస్తుంది. ముకుందన్ పాటను కంపోజ్ చేయగా విజయ్ పోలకి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. కలర్ ఫుల్ సెట్లో రాహుల్ విజయ్ శివానితో కలిసి శ్రీకాంత్ చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటతో సినిమాపై అంచనాలు తిరుగుతున్నాయి. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: తేజ మార్ని
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
డోప్: జగదీష్ చీకాటి
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్