కోన వెంక‌ట్‌, సి.ఇ.ఓ దీప్తి రావుల చేతుల మీదుగా ప్రారంభ‌మైన `ది లాండ్రీ హౌస్‌`

`ది లాండ్రీ హౌస్‌` బ‌ట్ట‌ల‌ను తగు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉత్త‌మ ప‌ద్ధ‌తుల్లో వాటిని శుభ్ర‌ప‌రిచేలా అన్వేషించి డ్రై క్లీనింగ్ చేయ‌టంలో అగ్ర‌గామిగా నిలుస్తుంది. లైవ్ డ్రై క్లీనింగ్ విధానాన్ని ప‌రిచ‌యం చేసిన తొలి ద‌క్షిణాది కంపెనీ ది లాండ్రీ హౌస్‌. ఈ స్టోర్‌ను మ‌హిళా యాజ‌మాన్యం నిర్వ‌హ‌ణ‌లో 50 శాతానికి పైగా మ‌హిళ‌లు ఇందులో ప‌ని చేస్తున్నారు.

ది లాండ్రీ హౌస్‌లో కేవ‌లం బట్ట‌ల‌నే కాకుండా బ్యాగులు, షూస్‌, కార్పెట్స్‌, క‌ర్టైన్స్‌ను డ్రై క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడీ `ది లాండ్రీ హౌస్‌` స్టోర్‌ హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉంది. మంచి నైపుణ్యం ఉన్నవారు ఈ స్టోర్‌ను నిర్వ‌హిస్తున్నారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ రైట‌ర్ కోన వెంక‌ట్‌, వెబ్ హబ్ సి.ఇ.ఒ దీప్తి రావుల ఈ స్టోర్‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రియాంక‌, అవినాష్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

అత్యాధునిక యంత్రాలు, మంచి ర‌సాయ‌నాలు, ప్యాకింగ్ మెటీరియ‌లను ఏర్పాటు చేశారు. మెషిన్‌ల‌కు సంబంధించిన‌ ఆపరేషన్‌లు, స్టెయిన్, స్పాట్ క్లీనింగ్, హ్యాండ్‌వాషింగ్ టెక్నిక్స్, ఫోమ్ ఫినిషర్ మెషిన్, స్టీమ్ ఇస్త్రీ మరియు గార్మెంట్ ప్యాకేజింగ్ వంటివి ప్రొఫెష‌న‌ల్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతాయి.

అస‌లు ఈ ప్రాసెస్‌ను ఎలా నిర్వ‌హిస్తార‌నే దాన్ని మీరు ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు. ఇండియాలోని 8 న‌గ‌రాల్లో 20కి పైగా ది లాండ్రీ హౌస్ స్టోర్స్ ఉన్నాయి. 6 ట‌న్నుల‌కు పైగా బ‌ట్ట‌ల‌ను డ్రై క్లీన్ చేస్తారు. 60వేల‌కు పైగా న‌మ్మ‌క‌మైన క‌స్ట‌మ‌ర్స్ వీరి సొంతం.

Our Services

– Dry-Cleaning
– Wet Cleaning
– Ironing
– Bag Cleaning
– Shoe Cleaning
– Carpet Cleaning
– Curtain Cleaning
– Home Cleaning
– Home Sanitization
– Car Cleaning
– Premium Laundry
– Sofa Cleaning