కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర #యూఐ ది మూవీ అక్టోబర్ లో రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ #యూఐ ది మూవీ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ టీజర్ తో వీక్షకులను ఫాంటసీ ప్రపంచలోకి తీసుకెళ్ళారు ఉపేంద్ర.

తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఉపేంద్ర రూలర్ లుక్ అదిరిపోయింది.

ఈ చిత్రంలో ఇందులో రీష్మా నానయ్య (లీడ్ యాక్టర్), నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్: శివ కుమార్ జె (KGF1&2 ఫేమ్), సినిమాటోగ్రఫీ HC వేణుగోపాల్ (A & H2O ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు.