రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’- ఇటలీలో సాంగ్ షూటింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించబోతుంది.

తాజాగా చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీ పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్ లో పాటని చాలా గ్రాండియర్ చిత్రీకరించనున్నారు.

‘కల్కి 2898 AD’ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనం సృష్టించింది. టీజర్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది.