బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజైంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘జవాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. సినిమా కోసం ఎంత ఆతృతగా ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారో అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతుంది.అడ్వాన్స్ బుకింగ్స్ వివిషయంలో ‘జవాన్’ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంటుంది. ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయటం ఓ హిస్టరీ అని ఎగ్జిబిటర్స్ మాట్లాడుకోవటం విశేషం.
అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నేషనల్ వైడ్ ఉన్న ఎగ్జిబిటర్స్ లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. పి.వి.ఆర్ పిక్చర్స్ సీఈఓ, చీఫ్ బిజినెస్ ప్లానంగ్, స్ట్రాటజీ ఆఫ్ పివిఆర్ లిమిటెడ్, ఎంఏఐ ప్రెసిడెంట్ కమల్ గ్యాన్ చందాని మాట్లాడుతూ ”’జవాన్’ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ ఎంతో అద్భుతంగగా ఉంది. షారూఖ్ గత చిత్రం పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ కంటే జవాన్ కు ఎక్కువ రెస్సాన్స్ వస్తోంది. చూస్తుంటే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయమని తెలుస్తోంది. కచ్చితంగా తొలి రోజు కలెక్షన్ పరంగా సినిమా హిస్టరీ క్రియేట్ చేయనుంది. నేను కచ్చితంగా లెక్కలు చెప్పలేకపోతున్నాను కానీ బాహుబలి, కెజియఫ్ చిత్రాల కంటే ఎక్కువ రెస్పాన్స్ ఉందని అర్థమవుతోంది.
ఐనాక్స్ లీజర్ లిమిటెడ్, చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ జ్యాలా మాట్లాడుతూ “‘జవాన్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తోన్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. పివిఆర్ ఐనాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలాంటి హయ్యస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ను చూడలేదు. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే 1,25,000 టికెట్స్ అమ్ముడయ్యాయి” అన్నారు.
డిలైట్ సినిమాస్ శశాంక్ రైజాదా మాట్లాడుతూ “జవాన్ సినిమాకు ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన గొప్పగా ఉంది. చాలా కాలం తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తున్నాం. రెస్పాన్స్ చూస్తుంటే జవాన్ చాలా పెద్ద హిట్ అవుతుంది. 2023లో బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుంది. పఠాన్, గద్దర్ 2 కంటే ఎక్కువగా ఉంది. ఇది ఇండస్ట్రీ శుభ పరిణామం” అన్నారు.
జైపూర్ కి చెందిన ఐకానిక్ సింగల్ స్క్రీన్ థియేటర్ అధినేత కిషోర్ కాలా మాట్లాడుతూ “జవాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు తిరుగులేని స్పందన వస్తుంది. నాలుగు రోజుల్లోనే ఐదు వేల టికెట్స్ అమ్మాం. తొలి రోజునే 2500 అమ్ముడయ్యాయి. గద్దర్ 2 కంటే జవాన్ కు ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. గద్దర్ కు ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా కాలేదు. కానీ క్రమంగా ఆ రెస్పాన్స్ పెరుగుతూ వచ్చింది. పఠాన్, గద్దర్ 2 చిత్రాలను జవాన్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దాటేసింది” అన్నారు.
దక్షిణాదికి చెందిన సీనియర్ మేనేజర్ వెంకట్ ప్రసాద్ మాట్లాడుతూ ”’జవాన్’ సినిమాకు వస్తున్న స్పందన చాలా గొప్పగా ఉంది. 8 షోస్ కు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే కొన్ని గంటల్లోనే అన్ని టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు మరే హిందీ సినిమాకు కానంత వేగంగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతుంది” అన్నారు.
‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.