సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈరోజు విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.
దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ.. “నిన్ననే ‘ఇంటింటి రామాయణం’ సినిమా థియేటర్లలో విడుదలైంది. చూసిన ప్రేక్షకులందరూ సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా నవ్వుకుంటున్నారు, ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతున్నారు. నిన్న సంధ్య థియేటర్ లో షో చూడటానికి వెళ్ళాము. ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది. సినిమా అయిపోయాక అందరూ చాలా బాగుందని ప్రశంసించారు. చూసినవాళ్లు అందరూ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. మీడియా వారు ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఇది కుటుంబంతో, స్నేహితులతో కలిసి ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం. యూఎస్ నుంచి కూడా కొందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక్కడ మంచి స్పందన వస్తుందని ప్రశంసించారు. ఇది మానవ సంబంధాల మీద నడిచే సినిమా. మనుషులు పరిస్థితులను ఎలా మారుతారు? వారి నిజ స్వరూపాలు ఎలా బయటకు వస్తాయి? అనేది ఈ సినిమాలో చూపించాం. థియేటర్ కి వెళ్లి చూడండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశమిచ్చిన నా నిర్మాతలకు, నా టీం అందరికి ధన్యవాదాలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన నాగవంశీ గారికి, మారుతి గారికి, ఆహా వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు” అన్నారు.
నటి నవ్య స్వామి మాట్లాడుతూ.. “ముందుగా మా టీం అందరికీ శుభాకాంక్షలు. మేం సినిమా చేసేటప్పుడే ఈ సీన్ కి ప్రేక్షకులు నవ్వుకుంటారు, ఈ సీన్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అనుకునేవాళ్లం. కానీ మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన వస్తోంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఎందుకంటే కామెడీ సీన్స్ ని నలుగురు కలిసి కూర్చొని చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. ఫన్ డబుల్ అవుతుంది. నిన్న థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల స్పందనతోనే ఈ సినిమా హిట్ అని మాకు అర్థమైపోయింది. చూసిన ప్రేక్షకులు అందరికీ సినిమా బాగా నచ్చింది. ఇంకా చూడనివాళ్ళు వెంటనే వెళ్లి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
నటుడు అంజి మాట్లాడుతూ.. “ముందుగా మా డైరెక్టర్ గారికి, నిర్మాతలకు, ఆహా వారికి, మారుతి గారికి, నాగవంశీ గారికి, నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా ఇంటిల్లిపాది వెళ్లి ప్రశాంతంగా థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేసి, హ్యాపీగా నవ్వుకొని.. ఇంటికి వెళ్లి కూడా చెప్పుకొని చెప్పుకొని నవ్వుకునే సినిమా. నిన్న కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూశాను. వాళ్ళు ఇంటికి వెళ్లిన తర్వాత ప్రత్యేకంగా ఫోన్ చేసి, ఇది అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నారు. నిన్న ఉదయం సంధ్య థియేటర్ లో, సాయంత్రం గోకుల్ థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాం. అందరూ సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఎవరో యూట్యూబ్ లో ‘హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది, దాని చుట్టూ కథ తిరుగుతుంది’ అని రివ్యూ చెప్పారు. దయచేసి సినిమా చూసి, రివ్యూ ఇవ్వండి. మా డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మేం ప్రత్యక్షంగా చూశాం. ఒక సినిమా నిర్మించడం అనేది ఎంత రిస్క్ తో కూడుకున్నదో మీకు తెలిసిందే. సినిమా వెనక ఎందరో కష్టముంటుంది. మీరు సినిమా చూడకుండా రివ్యూ రాయడం వల్ల ఎన్నో జీవితాలు తారుమారవుతాయి, నాశనమవుతాయి. దయచేసి సినిమా చూసి, మీకు ఏదనిపిస్తే అది రివ్యూ రాయండి. కానీ సినిమా చూడకుండా ఏది పడితే అది రాయకండి. మా సినిమా అయితే చూసిన అందరికీ నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకనిర్మాతలకు మరోసారి ధన్యవాదాలు” అన్నారు.
నటి కవిత మాట్లాడుతూ.. “నాకు ఈ సినిమాలో అవకాశమిచ్చిన దర్శకుడు సురేష్ గారికి ధన్యవాదాలు. మేము థియేటర్ కి వెళ్లి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులందరూ మొదటి సీన్ నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేశారు. మేం నవ్వుకుంటూ, ఎంత సరదాగా సినిమాలో నటించామో.. ప్రేక్షకులు కూడా అంతే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమా చూస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూ సపోర్ట్ చేయండి” అన్నారు.
బాలనటి చైత్ర మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగుంది. నేను సినిమా చూసి చాలా నవ్వుకున్నాను. మీరు కూడా సినిమా చూసి, మంచిగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అనంతరం విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు.
నటీనటులు: నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, చేవెళ్ల రవి, జీవన్
సమర్పణ: ఎస్.నాగవంశీ, మారుతి టీమ్
నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకుడు: సురేష్ నరెడ్ల
డీఓపీ: పి.సి. మౌళి
సంగీతం: కళ్యాణి మాలిక్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
నేపథ్య సంగీతం: కామ్రాన్
ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీపాల్ మాచర్ల