Most Popular Indian Movies: ముంబై, ఇండియా—జులై 9, 2025— సినిమాలు, టివి షోలు మరియు సెలెబ్రిటీలపై సమాచారానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరియు అధికారిక మూలమైన ఐఎండిబి (www.imdb.com). ఈరోజు 2025లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ సినిమాలు మరియు జులై మరియు డిసెంబరు 2025 మధ్య విడుదల అయ్యే ఎంతగానో ఎదురుచూడబడుతున్న భారతీయ సినిమాలను ప్రకటించింది. ఈ జాబితాలు, ఏ సినిమా చూడాలని కనుగొనుటకు మరియు నిర్ణయించుటకు ఐఎండిబి పై ఆధారపడే, ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబి ని సందర్శించిన 250 మిలియన్లకు పైగా నెలవారి సందర్శకుల అసలైన పేజ్ వీక్షణల ఆధారంగా తీసుకోబడ్డాయి
“ఐఎండిబి యొక్క 2025లో ఇప్పటి వచ్చిన అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ సినిమాల జాబితాలో ఛావా మొదటి స్థానములో నిలిచినందుకు గర్వంగా ఉంది,” అని ఛావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ అన్నారు. “ఇది నేరుగా ఫ్యాన్స్ అభిప్రాయము కాబట్టి ఈ గుర్తింపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారి అభిమానము మరియు విక్కీ కౌషల్, రష్మిక మందన, మరియు అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ మడాక్ ఫిల్మ్ మరియు నటనకు సానుకూల గుర్తింపు చాలా హృద్యంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మెచ్చే కథనాలను సృష్టించుటకు ఇది మా నటీనటులు మరియు సిబ్బందికి ప్రేరణను ఇస్తుంది.”
“ఐఎండిబి నుండి ఈ గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మా ఫ్యాన్స్ చూపిన అసాధారణ ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది,” అని కూలి దర్శకుడు లోకేష్ కనకరాజ్ అన్నారు. “38 సంవత్సరాల తరువాత లెజెండ్స్ రజనీకాంత్ మరియు సత్యరాజ్ కలయిక తెరపై ఒక మాయను సృష్టించింది, మరియు మేము తీసిన ఈ చిత్రము ప్రేక్షకులలో ప్రతిధ్వనిస్తుందని మరియు వారి ఆకాంక్షలకు సరిపోతుందని ఆశిస్తున్నాము.”
2025లో ఇంతవరకు వచ్చిన అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ సినిమాలు
ఛావా
డ్రాగన్
దేవ
రైడ్ 2
రెట్రో
ది డిప్లొమాట్
ఎల్2: ఎంపురాన్
సితారే జమీన్ పర్
కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా భాగ్
విడాముయార్చి
జనవరి 1, 2025 మరియు జులై 1, 2025 మధ్య భారతదేశములో విడుదల అయిన మరియు కనీసం 10,000 వోట్స్ తో సగటున 6 లేదా అంతకంటే ఎక్కువ ఐఎండిబి యూజర్ రేటింగ్ ఉన్న అన్ని సినిమాలలో, నెలకు 250 మిలియన్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబి సందర్శకుల అసలైన పేజ్ వ్యూస్ ద్వారా నిర్ణయించబడిన విధంగా ఈ టైటిల్స్ ఐఎండిబి వినియోగదారులలో అత్యంత ప్రాచుర్యం పొందాయి.
ఎంతగానో ఎదురుచూడబడుతున్న భారతీయ సినిమాలు: జులై-డిసెంబరు 2025
కూలి
వార్ 2
ది రాజా సాబ్
ఆంఖో కి గుస్తాఖియా
సైయారా
భాగి 4
సన్ ఆఫ్ సర్దార్ 2
హృదయపూర్వం
మహావతార్ నరసింహ
ఆల్ఫా
మిగిలిన సంవత్సరములో విడుదలలు ప్రణాళిక చేయబడిన భారతీయ సినిమాలలో, ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ఐఎండిబి సందర్శకుల అసలైన పేజ్ వ్యూస్ ద్వారా నిర్ణయించబడిన ఈ టైటిల్స్ జనవరి 1, 2025 మరియు జులై 1, 2025 మధ్య ఐఎండిబి వినియోగదారులలో అత్యంత ప్రాచుర్యం పొందాయి.
రెండు జాబితాలలో ఉన్న ప్రాజెక్ట్స్ లో మోహన్ లాల్, అజయ్ దేవగన్, మరియు పూజా హెగ్డే ఉండడం గమనించదగ్గ విషయం. ఎల్2: ఎంపురాన్ లో మోహన్ లాన్ ప్రధాన పాత్ర పోషించారు మరియు హృదయపూర్వంలో కూడా కనిపించారు. దేవ మరియు రెట్రో హెగ్డే నటించింది మరియు కూలీ సినిమాలో కూడా కనిపిస్తుంది, కాగా దేవగన్ రైడ్ 2 లో ప్రధాన పాత్ర పోషించారు మరియు సన్ ఆఫ్ సర్దార్ 2 లో కూడా కనిపిస్తారు. జులై నెలలో సైయారా లో అహాన్ పాండే మరియు ఆంఖో కి గుస్తాఖియా లో షనాయా కపూర్ ల మొదటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
2025లో ఇంతవరకు అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ సినిమాలలో, ఆరు హిందీ సినిమాలు, మూడు తమిళ సినిమాలు మరియు ఒక మళయాళం సినిమా ఉన్నాయి. ఎంతగానో ఎదురుచూడబడుతున్న భారతీయ సినిమాల జాబితాలో ఆరు హిందీ సినిమాలు మరియు తమిళ, తెలుగు మరియు మళయాల పరిశ్రమల నుండి ఒక్కొక్క సినిమా ఉన్నాయి, కాగా మహావతార్ నరసింహ అయిదు భాషలలో విడుదల అవుతుంది.
2025లో ఇంతవరకు వచ్చిన అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ సినిమాలల గురించి మరింత తెలుసుకొనుటకు ఈ వీడియో చూడండి మరియు పూర్తి జాబితాను ఇక్కడ చూడండి.
ఎంతగానో ఎదురుచూడబడుతున్న భారతీయ సినిమాలు: జులై-డిసెంబరు 2025 గురించి మరింత తెలుసుకొనుటకు ఈ వీడియో చూడండి మరియు పూర్తి జాబితాను ఇక్కడ చూడండి.
ఐఎండిబి వినియోగదారులు వీటిని మరియు అనేక మిలియన్ల కొద్దీ ఇతర ప్రముఖ సినిమాలు మరియు వెబ్ సీరీస్ ను https://www.imdb.com/watchlist వద్ద తమ వ్యక్తిగత వాచ్‌లిస్ట్ కు చేర్చుకోవచ్చు. ఫ్యాన్స్ వాళ్ళు చూడాలనుకునే సినిమాలను ట్రాక్ చేసుకోవటానికి ఐఎండిబి వాచ్‌లిస్ట్ ఫీచర్ వినియోగదారులు చూడాలఅనుకునే సినిమాలు మరియు వెబ్ సీరీస్ ల వ్యక్తిగతీకరించబడిన జాబితాను సులభంగా సృష్టించుటలో సహాయపడుతుంది. వినియోగదారులు తమ వాచ్‌లిస్ట్ ను ఐఎండిబి రేటింగ్, ప్రాచుర్యత మరియు మరెన్నో అంశాల ద్వారా కూడా విభజించుకోవచ్చు.
ఐఎండిబి గురించి
ఐఎండిబి అనేది సినిమాలు, టివి షోలు మరియు సెలిబ్రిటీల గురించి సమాచారము కొరకు ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మరియు అధికారిక మూలము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల లక్షల కొలది వినియోగదారులు వాళ్ళు చూడాలనుకునే వాటిని కనుగొనుటకు మరియు నిర్ణయించుకొనుటకు, ఐఎండిబిప్రో ద్వారా తమ వృత్తిపరమైన వినోద కెరీర్స్ ను ముందుకు తీసుకెళ్ళుటకు మరియు ఐఎండిబి డేటా మరియు ట్రెండింగ్ అంతర్దృష్టులను ఉపయోగించి తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకొనుటకు ఐఎండిబి పై ఆధారపడుతున్నారు. ఫ్యాన్స్ ఏది చూడాలి మరియు ఎక్కడ చూడాలి అనేది కనుగొనుటకు మరియు నిర్ణయించుకొనుటకు సహాయపడే ఉత్పత్తులు మరియు సేవలలో ఉన్నవి: డెస్క్‌టాప్ మరియు మొబైల్ డివైజెస్ కొరకు ఐఎండిబి వెబ్సైట్; iOS మరియు ఆండ్రాయిడ్ కొరకు యాప్స్; మరియు ప్రైమ్ వీడియో పై X-రే. వినోద పరిశ్రమ వృత్తినిపుణుల కొరకు, ఐఎండిబి ఐఎండిబిప్రో మరియు బాక్స్ ఆఫీస్ మోజో లను అందిస్తుంది. ఐఎండిబి తన విస్తృతమైన మరియు అధికారిక డేటాబేస్ నుండి సమాచారాన్ని ప్రపంచవ్యాప్త థర్డ్-పార్టీ వ్యాపారాలను లైసెన్స్ చేస్తుంది; developer.imdb.com వద్ద మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఐఎండిబి ఒక అమెజాన్ కంపెనీ. మరింత సమాచారము కొరకు, https://www.imdb.com/press సందర్శించండి మరియు @IMDb_in అనుసరించండి.



