మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతులమీదుగా ‘ఇది నా కథ’ ఆవిష్కరణ!

‘ ఇది నా కథ’ షార్ట్ ఫిలింను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం రామచంద్రపురం లోని తన నివాసంలో ఆవిష్కరించారు.. హైస్కూల్ లో టెన్త్ క్లాస్ ముగిసిన అనంతరం దాదాపు 40 ఏళ్ల తరువాత కలిసిన మిత్రుల బ్యాక్ డ్రాప్ తో ‘ఇది నా కథ’ షార్ట్ ఫిలింను చిత్రీకరించారు. ‘ఓ మిత్రుడి కూతురి కాపురం సజావుగా సాగడం లేదన్న సున్నితమైన అంశాన్ని మిత్రులు తెలుసుకొని దానిని ఎలా పరిష్కరించాలి’ అన్న దానిపై కథ సాగింది. ఫ్రెండ్లీ ఫిలిమ్స్ బ్యానర్ పై చిత్రీకరించిన ఈ షార్ట్ ఫిలిం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షార్ట్ ఫిలిం కథను సిహెచ్ రామకృష్ణ రూపొందించగా.. రవికుమార్ స్క్రీన్ ప్లే, దర్శకత్వo వహించారు. డైలాగ్స్ కేతన పడాల, డిఓపి సాయిరాం అవనిగడ్డ, ఎడిటింగ్ ఎస్ వి, గౌరీ శంకర్, డబ్బింగ్ ఎస్ వి ఆడియోగ్రఫీ నిర్వహించారు. పబ్లిసిటీ డిజైనర్ ఆశ్లేష్ రాయ్, టైటిల్, ఎడిటింగ్ ఎస్వీ చిత్రోగ్రఫీ, మ్యూజిక్ అనిరుధ్ (ఏటీఎస్).