Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 నుంచి ‘కనకావతి’గా రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసిన హోంబాలే ఫిల్మ్స్

వరమహాలక్ష్మి పండుగ శుభ సందర్భంగా సినిమాటిక్ ఎపిక్ కాంతార చాప్టర్ 1నుంచి కనకావతి పాత్రలో హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్ర ఫస్ట్ లుక్‌ను హోంబాలే ఫిల్మ్స్ లాంచ్ చేసింది.

రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 బ్లాక్‌బస్టర్ కాంతారకు ప్రీక్వెల్‌. ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది.

మేకర్స్ రిషబ్ శెట్టి పుట్టినరోజున అతని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు,. ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించింది. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో కూడా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది

ఇప్పుడు, కనకావతిగా రుక్మిణి వసంత్ పాత్రలో కనిపించిన ఫస్ట్ లుక్ సినిమా చుట్టూ ఉన్న ఉత్సాహాన్ని మరింత పెంచింది.

ఈ చిత్రం కాంతార యూనివర్స్ లో మరో అద్భుతమైన అధ్యాయం కానుంది. అర్వింద్ ఎస్. కాశ్యప్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం, హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగందూర్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుంది.

కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2, 2025న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Congress Tulasi Reddy Brief Analysis On CM Chandrababu Naidu Singapore Tour | YS Jagan | AP News |TR