‘మనమే’ బ్యూటీఫుల్ స్టొరీ, ఎమోషన్స్ వున్న కంప్లీట్ ఎంటర్ టైనర్: ప్రీరిలీజ్ ఈవెంట్ లో శర్వా

ఛార్మింగ్ స్టార్ శర్వా తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ శర్వాకు ‘ఛార్మింగ్ స్టార్‌’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్ లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.

ప్రీరిలీజ్ రిలీజ్ ఈవెంట్ లో ఛార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ.. స్వామి శరణం. అందరికీ నమస్కారం. ముందుగా మనమే వస్తామని చెప్పి ముచ్చటగా నాలుగో సారి సీఎం అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాజులేషన్స్. చాలా సంతోషంగా వుంది. రిజల్ట్స్ వచ్చేశాయి. ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. జూన్ 7న మనమే అంటూ మరో పండగ స్టార్ట్ అవుతోంది. దాని తర్వాత 27 కల్కి. మరో పండగ వాతావరణం. ఇక నుంచి అన్ని మంచి రోజులే. శ్రీరామ్ మనమే కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే కథ చేయాలి. అయితే వరుసగా సీరియస్ సినిమాలు చేసేస్తున్నానని నాకే అనిపించింది. అందరూ కనబడినపుడు మహానుభావుడు, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి ఎంటర్ టైనర్స్ చేయమని కోరేవారు. నాకూ ఎప్పుడూ కొత్తగా చేయాలనే వుంటుంది. కథల్లో క్యారెక్టరైజేషనే కొత్తగా వుంటుంది. మనమే లో అలాంటి కొత్త క్యారెక్టరైజేషనే వుంది. మంచి కథ చేయాలి, ఎంటర్ టైన్నింగ్ గా వుండాలని అనుకున్నాం. అన్నీ సినిమాలు కాదని ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటీఫుల్ పాయింట్ టైం గురించి. మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ టైం. ఈ సినిమాలో శ్రీరామ్ ఆదిత్య ఈ పాయింట్ ని చాలా చక్కగా చెప్పారో చూస్తారు. లాస్ట్ 40 మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెల్తారు. ఓన్లీ ఎంటర్ టైన్మెంట్ కి ఓ మంచి సినిమా తీయాలని చేశాం. ఎట్టిపరిస్థితిలో డిస్సాపాయింట్ చేయనివ్వం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

ప్రతిఒక్కరం చాలా కష్టపడి ప్రతి రోజు గొడవపడుతూ సినిమా చేశాం. సినిమాని నమ్మాము. ప్రేమించాం. ప్రేమ వున్నప్పుడు ఎప్పుడూ గొడవలు వుంటాయి. ఈ సినిమాని అంతగా ప్రేమించాను. నేను ఇంత కొత్తగా కనిపించినా, పెర్ఫెర్ఫాం చేసిన ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్ కే ఇస్తా. తనని మొదటి నుంచి బలంగా నమ్మాను. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి చెబుతూనే వున్నాను. శ్రీరామ్.. ఐ హేట్ యూ . ఐ లవ్ యూ టూ. వాళ్ళ వైఫ్ మీ రెండో పెళ్ళామని ఎప్పుడూ అంటూ వుంటారు.(నవ్వుతూ) వాళ్ళిద్దరూ ఎంత గొడవపడ్డారో తెలీదు కానీ మేము ఈ సినిమాకి అంత గొడవ పడ్డాం. దిని గురించి సక్సెస్ పార్టీలో మాట్లాడుకుందాం.సక్సెస్ అంటే గుర్తుకువచ్చింది. ఈ ఫంక్షన్ పిఠాపురంలో చేయాలని అనుకున్నాం. కానీ పర్మిషన్ దొరకలేదు. విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ అక్కడ చేస్తాం. సినిమా సక్సెస్ పార్టీ పిఠాపురంలో జరగాలని నా కోరిక. సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం.

మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్ కి థాంక్స్. కృతి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వచ్చారు. చాలా చక్కగా చేశారు. ఐ థింక్ యువర్ డాడ్ ఈజ్ వెరీ ప్రౌడ్. ఆయన మొహంలో ఆనందం కనిపిస్తోంది. ఇలాంటి మంచి సినిమాలు బాగా తీయాలని కోరుకుంటున్నాను. మారుతి గారు, కిషోర్ గారు, శివ నిర్వాణ గారు, సాయి రాజేష్ గారు థాంక్స్ ఫర్ కమింగ్. 35 సినిమాలు, 20 ఏళ్ళు ఎలా అయ్యిందో తెలీదు. నాన్న గారు దీని గురించి మాట్లాడుతుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఐయాం వెరీ ప్రౌడ్ అఫ్ మై ఫిల్మోగ్రఫీ. ఈ సందర్భంగా హిట్లుకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో సినిమాలు తీసుకున్న డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి, జన్మనిచ్చిన తల్లితండ్రులకు, ఫ్రండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాధాబివందన. ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకొని ఆఫీస్ లు చుట్టూ తిరిగిన రోజులు గుర్తున్నాయి. ఈ రోజు ఆ కళామతల్లి, ఇండస్ట్రీ ఇంత ఇచ్చిందంటే రియల్లీ గ్రేట్ ఫుల్. స్వామీ శరణం. చాలా ఎమోషన్ గా వుంది. ఇట్స్ గుడ్ ఫీలింగ్. ఇరవైఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. ‘ఛార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇచ్చిందుకు విశ్వగారికి చాలా థాంక్స్. నాతో పాటు జర్నీ చేసిన నా టీం అందరికీ థాంక్స్. వంశీ శేఖర్ పీఆర్వో కంటే మా డార్లింగ్స్. మేమంతా ఒకేసారి స్టార్ట్ అయ్యాం. వాళ్ళ ఫస్ట్ సినిమా, నా సినిమా ‘కో అంటే కోటీ’ తో మొదలై వారు పీఆర్వోలు అయ్యారు. ఈ రోజు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీలా అయ్యారు. ఐయాం సో ప్రౌడ్ అఫ్ యూ డార్లింగ్స్.

ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. తులసీ అమ్మ ఈ వేడుకు రావడం ఆనందంగా వుంది. నా కొడుకు అన్నారు వందకోట్ల సినిమా అన్నారు. వారి ఆశీర్వాదం ఇలానే కావాలి. శివ గారు, అరుణ్ గారు హీరోగా చేస్తూ ఒక మంచి కథ చెబితే ఇందులో పార్ట్ అయ్యారు. ఇద్దరికీ చాలా థాంక్స్. హీరోలుగా వున్నప్పుడు పక్క హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడం మామూలు విషయం కాదు. దానికి గట్స్ వుండాలి. శీరత్, ఆయేషాతో వర్క్ చేయడం సో వండర్ ఫుల్. శీరత్ తో కలిసి రన్ రాజా రన్ బ్లాక్ బస్టర్ కొట్టాం. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాం. సినిమా మైత్రీ మూవీస్ వారు కొనుక్కున్నారు. థాంక్ యూ నవీన్ గారు, రవి గారు డూయింగ్ థిస్ ఫిల్మ్. శశి గారు సినిమా చూసి ఫస్ట్ కాల్ చేశారు. ఆయనకి చాలా నచ్చింది. చాలా బావుంది అన్నారు, అలాంటిది వినడానికి నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఆయన మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు.

కృతిశెట్టి గారు చాలా స్వీట్. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు, ఆవిడ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ సినిమాలో చూస్తారు. అద్భుతంగా చేశారు. మైన్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టం. సినిమా కోసం కృతి గారు చాలా కష్టపడ్డారు. కృతితో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విక్రమ్ ఆదిత్య చాలా బాగా నటించారు. పిల్లల్ని తీసుకొచ్చే సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. తల్లితండ్రులని తీసుకొచ్చే సినిమా రాలేదు. అమ్మమ్మ తాతయ్యలని తీసుకొచ్చే సినిమా లేదు. శతమానం భవతి సినిమాని ఫ్యామిలీతో కలిసొచ్చి ఎంత కంఫర్ట్ బుల్ గా చూశారో మనమే అంతకంటే కంఫర్ట్ బుల్ గా హ్యాపీగా చూడొచ్చు. వివేక్ గారు, విశ్వ గారికి ఎలా థాంక్స్ చెప్పాలో నాకు తెలీదు. వాళ్ళు చాలా జెన్యూన్. చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. విశ్వ గారు నా బిగ్గెస్ట్ సపోర్ట్. ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామ్ ఆదిత్యకి ఇవ్వండి. ఏదైనా అనిపిస్తే( ఆ ఛాన్స్ లేదు) ఆ భాద్యత నేను తీసుకుంటా. ఇక నుంచి కొత్త శర్వా చూడబోతున్నారు. థాంక్ యూ వెరీ మచ్, జయహో మనమే. శర్వా అనే నేను.. మీ అందరి సమక్షంలో జూన్ 7న మనమేతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని, ఎవరినీ డిస్సాపాయింట్ చేయనని హామీ ఇస్తున్నాను’అన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిన్న మన సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాం. ఇది కంటిన్యూ చేస్తూ.. మనమే గ్రేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అలరిస్తుంది. ఈ సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. శర్వా పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. తన ఛార్మింగ్ లుక్స్, పెర్ఫార్మన్స్ చూసి తనకి ‘ఛార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇస్తున్నాను. మనమే అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. దిని సక్సెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ లో చాలా గ్రాండ్ చేస్తాం. సక్సెస్ మీట్ లో మరింత మాట్లాడుకుందాం’ అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. శర్వా డార్లింగ్.. నిన్న గెలిచింది మనమే. రేపు గెలవబోయేది మనమే. శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్లు ఒక పండగ వాతావరణం వుంది. నిన్నటి నుంచి కళ్యాణ్ గారి రీల్స్ చూస్తూనే వున్నాం. ప్రతి రీల్ లోనూ గూస్ బంప్స్ వస్తూనే వున్నాయి. ఇంకా ఆ వైబ్ లోనే వున్నాం. చాలా ఆనందంగా వుంది. రెండు తెలుగు రాష్ట్రాలు మంచి పాజిటివ్ వైబ్ లో హెల్తీ ఎట్మాస్పియర్ లో వున్నాం. ఈ సినిమాతో అది కంటిన్యూ అవుతుంది. ఫ్యామిలీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందనడంలో డౌట్ లేదు. శర్వా నా మహానుభావుడు. అందులో ఎంత ఫ్రెష్ గా అనిపించాడో మళ్ళీ ఇందులో అంత పాజిటివ్ వైబ్ వుంది. రోజు రోజుకి యంగ్ అవుతున్నాడు. తనతో కాలేజీ స్టొరీ తీయాలేమో. కృతి ఈ సినిమా ప్రొడ్యూసర్ గా పూర్తి భాద్యత తీసుకొని సినిమాని ఇంత గొప్పగా ప్రేక్షకులు మందుకు తీసుకురావడం ఆనందంగా వుంది. విశ్వ ప్రసాద్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ సినిమా అందరికీ చాలా పెద్ద ఫిల్మ్ అవుతుంది. ఆడియన్స్ మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మనమే తప్పకుండా ఆడియన్స్ నచ్చే సినిమా అవుతుంది. ఈ ఈవెంట్ కి వస్తున్నప్పుడు ప్రభాస్ గారితో మాట్లాడాను. ఆయన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పామని చెప్పారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ.. మనమే నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. టీం అందరికీ థాంక్స్. మా ఫాదర్, వివేక్ సార్ సపోర్ట్ కి చాలా థాంక్స్. శ్రీరామ్ శర్వా. కృతితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. సినిమా చూసి వారితో లవ్ లో పడిపోయాను, విక్కీ రాక్ స్టార్. జూన్ 7న అందరూ థియేటర్స్ లో వాచ్ చేయండి’ అన్నారు

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ..మనమే సినిమా నాకు పెద్ద డ్రీం. ఈ డ్రీం ని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేసి నా రైటింగ్ టీమ్, లిరిక్ రైటర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీం అందరికీ థాంక్స్. వివేక్ గారు చాలా సపోర్టివ్. కృతి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా డెబ్యు చేశారు. కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి లక్కీ ఛార్మ్. వండర్ ఫుల్ పర్శన్. విశ్వప్రసాద్ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. చాలా ప్యూర్ గా వుంటారు. మనమే ని ఇంత గ్రాండ్ స్కేల్ లో తీసిన ఆయనకి థాంక్స్. ఇందులో ఓ రోల్ చేయడానికి యాక్సప్ట్ చేసిన శివకి థాంక్స్. వెన్నెల కిశోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, అయేషా, శీరత్ అందరికీ థాంక్స్. కృతి శెట్టి ఇందులో చక్కని పెర్ఫార్మెన్స్ వున్న రోల్ లో కనిపిస్తారు. తను చాలా సిన్సియర్. మనమే డ్రీం ని మొదటి నమ్మింది నా డార్లింగ్ శర్వా. నా డ్రీంని నా కంటే బలంగా నమ్మారు. ఈ జర్నీ అంతా చాలా సపోర్ట్ చేశారు. తను ఫినామినల్ యాక్టర్. శర్వా తన ఎనర్జీతో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. సినిమాని ఇప్పటికే యాభై అరవైసార్లు చూశాను. చూసిన ప్రతిసారి విజల్ వేయాలనిపిస్తుంది. శర్వా క్యారెక్టర్ తో లవ్ లో పడిపోయాను. మై లిటిల్ సన్ విక్రమ్. మై ప్రౌడ్ అఫ్ మై బాయ్. మనల్ని మనం నమ్మి నిలబడితే ఏ రేంజ్ లో అన్సర్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అదే ఇన్ స్ప్రేషన్ తో టీంలో అందరం ‘మనమే’ని నమ్మి చేశాం. ఈ పండగ వాతావరణంని కంటిన్యూ చేసి సినిమా మనమే అవుతుంది. మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్, ఎనర్జీని ఫీల్ అవుతారు’ అన్నారు

హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ.. శర్వా గారితో సినిమా చేస్తున్నాని మా ఫ్రెండ్స్ కి చెబితే ..ఫుల్ ఫ్యామిలీతో వెళ్లి చూస్తామని చెప్పారు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా శర్వా గారితో చాలా కనెక్ట్ అవుతారు. పేరెంట్స్ తో వచ్చి చూడండి. చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది. శర్వాగారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. శ్రీరామ్ గారు కథ చెప్పినప్పుడు ఎలాంటి మ్యాజిక్ కనిపించిందో సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే మ్యాజిక్ ఫీల్ అయ్యాను. ఈ సినిమా పార్ట్ చేసిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారికి థాంక్స్. విక్కీ అన్ బిలివబుల్. తను చేసిన ప్రతి సీన్ చాలా ఎమోషనల్ గా అనిపించింది. హేశం బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారితో మరోసారి కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఫ్యామిలీతో వచ్చి చూడండి. తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.

ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. మనమే చాలా మంచి సినిమా. శర్వా గారు, కృతి గారు, సీరత్, అయేషా అందరూ చాలా బాగా చేశారు. లండన్ లో మంచి చలిలో వర్క్ చేశారు. అందరికీ థాంక్స్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. మంచి ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలమైయింది. శర్వా గారికి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా వుంటారు. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది. సక్సెస్ మీట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నారు.

డైరెక్టర్ శివనిర్వాణ మాట్లాడుతూ.. మనమే చాలా రోజుల తర్వాత పాజిటివ్ వైబ్రెంట్ ఎంటర్ టైన్మెంట్ ఫిల్మ్ గా వస్తోంది. ట్రైలర్ చాలా నచ్చింది. వైబ్రెంట్, పాజిటివ్ గా వుందని శ్రీరాం తో చెప్పాను. మ్యూజిక్ విజువల్స్ చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ ప్రేమతో నిండిపోతాయని అనిపిస్తోంది. శ్రీరామ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. శర్వా గారు రన్ రాజా రన్ తర్వాత లాంటి ఫుల్ ఫ్లేడ్జ్ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్నారు. రెండుగంటల మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తారని నమ్ముతున్నాను. హేశం అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. సినిమా అదిరిపోయిందని క్లోజ్ ఫ్రండ్స్ చెప్పారు. అందరూ థియేటర్స్ లో మనమే ని ఎంజాయ్ చేయండి.’ అన్నారు.

డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. మనమే ప్రమోషనల్ కంటెంట్ చాలా బావుంది. ప్రామెసింగ్ గా వుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. శ్రీరామ్ ఆదిత్య అంటే నాకు చాలా ఇష్టం. క్రాఫ్ట్ మీద మంచి పట్టువున్న డైరెక్టర్ తను. మంచి హ్యూమన్ బీయింగ్. మ్యూజిక్ విన్నాను అద్భుతంగా వుంది. శర్వా గారు అమెజింగ్ గా వున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు.

డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాని మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూడటం జరిగింది. సినిమా ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. శర్వా గారి పెర్ఫార్మెన్స్ వేరే లెవల్. ఎక్స్ ట్రార్డినరీ యాక్టింగ్. సినిమా మ్యూజిక్, ఎంటర్ టైన్మెంట్ సూపర్బ్. థియేటర్స్ లో చూసిన తర్వాత అందరూ ఇదే ఫీలౌతారు. ఈ సమ్మర్ కి ఇదే పెద్ద బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు’ అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.