Vasudeva Sutham: హీరో ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

Vasudeva Sutham: మాస్టర్ మహేంద్రన్ హీరోగా బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు.

‘వసుదేవసుతం దేవం’ అంటూ సాగే ఈ పాటను ఆకాష్ జగన్నాథ్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం, పవన్-శృతిక సముద్రాల గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరో చార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ జంట చూడముచ్చటగా ఉంది. ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన ఈ పాట అందరినీ కట్టి పడేసేలా ఉంది. ఇక తెర అంతా కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. కొరియోగ్రాఫీ కూడా ఎంతో చక్కగా కుదిరినట్టు కనిపిస్తోంది.

*పాటను రిలీజ్ చేసిన అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ..* ‘వసుదేవసుతం’ మూవీలోని ‘వసుదేవసుతం దేవం’ అనే పాట చాలా బాగుంది. టీం అంతా వచ్చి నన్ను కలిసింది. ఈ పాటను నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం బాగుంది. మహేంద్రన్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Mass Jathara Movie Review: ‘మాస్ జాతర’ రివ్యూ!

Temple Stampede: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి: తక్షణ సహాయక చర్యలకు ఆదేశం

రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.

*తారాగణం:* మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు

*సాంకేతిక సిబ్బంది:*

రచయిత & దర్శకుడు : వైకుంఠ్ బోను
నిర్మాత : ధనలక్ష్మి బాదర్ల
బ్యానర్ : రెయిన్‌బో సినిమాస్
సంగీతం : మణిశర్మ
DOP : జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్)
లిరిసిస్ట్ : చైతన్య ప్రసాద్, శ్రీ హర్ష ఈమని
ఫైట్స్ : రామకృష్ణ
కోరియోగ్రాఫీ: అజయ్ సాయి
పీఆర్వో : సాయి సతీష్

Vundavalli Aruna Kumar Full Serious On Jagan | Pawan kalyan | Telugu Rajyam