ఫిబ్రవరి 23న హర్ష చెముడు “సుందరం మాస్టర్” రిలీజ్

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. ఆల్రెడీ ఇది వరకు వదిలిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తి కలింగించిన సంగతి తెలిసిందే.

ఒక గ్రామంలో కష్టపడే ఉపాధ్యాయుడి చుట్టూ సుందరం మాస్టర్ కథ తిరుగుతుంది. మిర్యాల మెట్ట అనే మారుమూల గ్రామంలో ఇంగ్లీషు టీచర్‌గా సుందరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని వయసుల వారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విద్యార్థులుగా నమోదు చేసుకుంటారు. సుందరం మాస్టర్ వాళ్ళందరికీ భాషని ఎలా బోధిస్తారనే దాన్ని వినోదాత్మక చిత్రంగా రూపొందించారు.

ఈరోజు ‘సుందరం మాస్టర్’ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. ఫిబ్రవరి 23న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుందని ప్రకటించారు.

ఈ కామెడీ డ్రామాని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హర్ష చెముడు టీజర్ లో నవ్వించాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిర్యాల మెట్ట విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ డ్రామా. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. దీపక్ ఎరెగడ సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద, బాలకృష్ణ, హర్షవర్ధన్, భద్రం తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్లు: RT టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా
నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
రచన, దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
క్రియేటివ్ ప్రొడ్యూసర్స్: శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు
సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరెగడ
కళ: చంద్రమౌళి ఈతలపాక
కాస్ట్యూమ్స్: శ్రీహిత కోటగిరి, రాజశేఖర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమంత్ కుర్రు
ఎడిటర్: కార్తీక్ వున్నవా
ధ్వని: సాయి మణిందర్ రెడ్డి
కొరియోగ్రఫీ: విజయ్ బిన్ని
పి.ఆర్.ఓ: వంశీ కాకా