Mowgli 2025: నేషనల్ క్రష్ రష్మిక మందన్న లాంచ్ చేసిన రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ పవర్ ఫుల్ ట్రైలర్

Mowgli 2025: యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025లో పూర్తిగా డిఫరెంట్ అవతార్ లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే బలమైన బజ్ సృష్టించింది. ఈరోజు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ట్రైలర్ విలన్ పాత్రను పోషించిన బండి సరోజ్ కుమార్ పరిచయంతో ప్రారంభమవుతుంది. కథనం మోగ్లీ ప్రశాంతమైన ప్రపంచానికి మారుతుంది. అతని గర్ల్ ఫ్రెండ్, చెవిటి-మూగ డ్యాన్సర్, అడవిలో షూటింగ్ చేస్తున్న ఫిల్మ్ యూనిట్‌లో భాగం. దర్శకుడు ఆమెతో ఫ్లిర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, మోగ్లీ వార్నింగ్ ఇస్తాడు. సరోజ్ కుమార్ ఆ ప్రాంతంలో పోస్టింగ్ కావడం, ఆ అమ్మాయి పట్ల అతనికి ఉన్న ఆసక్తితో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఆమెను రక్షించాలని నిశ్చయించుకున్న మోగ్లీ యుద్ధానికి సిద్ధమవుతాడు.

తన తొలి సినిమా కలర్ ఫోటోతో మనసుని ఆకట్టుకునే ప్రేమకథలను రూపొందించడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన దర్శకుడు సందీప్ రాజ్, ఈసారి చాలా పెద్ద కాన్వాస్‌పై అదరగొట్టారు. చెవిటి-మూగ హీరోయిన్, అసాధారణ కథానాయకుడు, రామాయణ శైలి కథనం ఈ చిత్రానికి ప్రత్యేకతని జోడించింది.

రోషన్ కనకాల మోగ్లీగా పాత్రలో అదరగొట్టారు.ఈ పాత్ర కోసం కంప్లీట్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. సాక్షి మడోల్కర్ సవాలుతో కూడిన పాత్రను పోషించారు. బండి సరోజ్ కుమార్ విలన్ గా అద్భుతంగా నటించారు. అతని శక్తివంతమైన విలన్ పాత్ర కథలో హీరోయిజాన్ని పెంచుతుంది. హర్ష చెముడు తనదైన ముద్రవేశాడు.

అటవీ నేపథ్యాన్ని అందమైన విజువల్స్‌తో రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తుంది. కాల భైరవ ఇంటెన్స్ స్కోర్ కథనానికి వెన్నెముకగా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ కిరణ్ మామిడి, యాక్షన్ కొరియోగ్రఫీ నటరాజ్ మాదిగొండ అద్భుతమైన పనితీరు కనబరిచారు

డిసెంబర్ 12న విడుదల కానున్న మోగ్లీ 2025 ట్రైలర్ తో అంచనాలని భారీగా పెంచింది.

తారాగణం: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి
PRO: వంశీ-శేఖర్

Telangana Leaders Fire On Pawan Kalyan Konaseema Comments || Ap Public Talk || Ys Jagan || TR