పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే.. తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం సహజం. తాజాగా ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ తో ఈ విషయం మరోసారి రుజువైంది. ట్రైలర్ విడుదలైన క్షణం నుండి అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని చారిత్రక యోధుడు పాత్రలో కనిపించడం అందరినీ ఆకర్షించింది. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కట్టిపడేసే లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ తో.. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ప్రశంసలు అందుకుంటోంది.
‘హరి హర వీరమల్లు’ చిత్రం ట్రైలర్ నుంచే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభిస్తుందని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. ఆయన మాటే నిజమైంది. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ తెలుగులో కేవలం 24 గంటల్లోనే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 62 మిలియన్ల వ్యూస్ సాధించింది.
దర్శకుడు జ్యోతి కృష్ణ ట్రైలర్ ను రూపొందించిన తీరు అందరినీ మంత్రం ముగ్దుల్ని చేసింది. ట్రైలర్ అందరి అంచనాలకు మించేలా ఉంది. వీరమల్లును ఆయన ఒక పాత్రగా కాకుండా, సినిమాటిక్ శక్తిగా మలిచారు. బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన యుద్ధ సన్నివేశాల మేళవింపుతో ట్రైలర్ ను మలిచిన తీరు మెప్పించింది. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రేక్షకులలో ప్రతిధ్వనిస్తోంది.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరోస్థాయికి తీసుకెళ్ళారు. విజువల్స్ కు ప్రాణం పోశారని చెప్పవచ్చు. తన సంగీతంతో అటు భావోద్వేగ సన్నివేశాలు, ఇటు యుద్ధ సన్నివేశాల గాఢతను పెంచారు. చారిత్రక కథకు తగ్గట్టుగా కీరవాణి అందించిన సంగీతం.. ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తోంది.
ఛాయాగ్రాహకులు జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస సన్నివేశాలను ఎంతో అందంగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంది. చారిత్రక కథకు తగ్గట్టు భారీతనాన్ని చూపిస్తుంటే.. కథలోని భావోద్వేగాన్ని, వీరమల్లులోని ఆవేశాన్ని చక్కగా కెమెరాలో బంధించారు. ఇక ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి తన అద్భుతమైన సెట్ లతో ప్రేక్షకులను మొఘల్ యుగంలోకి తీసుకువెళ్లారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందం యొక్క ఆశయాన్ని, నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ట్రైలర్ ఉంది. అందుకే ప్రేక్షకులు, అభిమానులు, పరిశ్రమ వర్గాల నుండి ఏకగ్రీవంగా ప్రశంసలు అందుకుంటోంది.
రాజ కుటుంబీకురాలుగా నిధి అగర్వాల్ కనిపించడం, ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ స్క్రీన్ ప్రజెన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన శక్తివంతమైన సంభాషణలు కూడా ట్రైలర్ కు మరింత బలాన్ని జోడించాయి.
ట్రైలర్ తోనే ఈస్థాయి సంచలనాలు సృష్టించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం.. జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తుఫాను ఇప్పుడే ప్రారంభమైంది. వీరమల్లు దానిని ముందుండి నడిపిస్తున్నాడు.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి,
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్