గోపీచంద్, శ్రీను వైట్ల, #గోపీచంద్32 లెంగ్తీ షెడ్యూల్ హిమాలయాల్లో ఈరోజు ప్రారంభం

దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం మాచో స్టార్ గోపీచంద్‌తో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు ఇటలీలో ఒక షెడ్యూల్‌, మరొక షెడ్యూల్‌ గోవాలో పూర్తి చేశారు. ఈరోజు, గోపీచంద్, ఇతర ప్రముఖ తారాగణంతో హిమాలయాలలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో కీలకమైన, లెంగ్తీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ ప్రాజెక్ట్‌తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తన యాక్టర్స్ కు డిఫరెంట్ మేకోవర్లు ఇవ్వడంలో పేరుపొందిన శ్రీను వైట్ల గోపీచంద్‌ని సరికొత్తగా చూపిస్తున్నారు. ఇందులో యాక్షన్‌తో పాటు శ్రీనువైట్ల మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.

శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

నటీనటులు: ‘మాచో స్టార్’ గోపీచంద్

సాంకేతిక విభాగం:
రచయిత & దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత: వేణు దోనేపూడి
బ్యానర్: చిత్రాలయం స్టూడియోస్
స్క్రీన్ ప్లే: గోపీ మోహన్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో