గెట్ రెడీ: కల్కి 2898 AD ట్రైలర్ జూన్ 10న రిలీజ్

ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ 10 జూన్ 2024న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బుధవారం ఉదయం ట్రైలర్ లాంచ్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా అఫీషియల్ హ్యాండిల్ ఈ న్యూస్ ని షేర్ చేసింది.

“ ఏ న్యూ వరల్డ్ అవైట్స్
#Kalki2898AD Trailer on June 10th.”

https://x.com/kalki2898ad/status/1798210288849940678?s=46&t=td36fd1VqvQ20yDywt6_9Q

ట్రైలర్ రిలీజ్ డేట్ ని కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. పోస్టర్ లో మనం భైరవను చూడవచ్చు. ప్రభాస్ పర్వత శిఖరంపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్ పై రాసిన “ Everything is about to change” క్యాప్షన్ మరింత క్యురియాసిటీని పెంచింది.

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపొందిన ‘కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ మూవీ అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇండియన్, ఇంటర్ నేషనల్ మార్కెట్లలో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది.

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.