ప్రభాస్‌ స్పిరిట్‌పై అభిమానుల ఆశలు!

‘బాహుబలి2’ హిట్‌ తర్వాత ఏ మాత్రం గ్యాప్‌ తీసుకోకుండా ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేసినా ప్రభాస్‌కు ఎక్కడా హిట్‌ దొరకలేదు. ఇక రాధేశ్యామ్‌ సినిమా ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా వరస్ట్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఈ ఏడాది రిలీజైన ఆదిపురుష్‌ సినిమాకు ట్రోల్స్‌లో ఎన్ని రకాలుంటాయో అన్ని వాడేవారు నెటిజన్లు. రామాయణం కథను కించపరిచాడని కామెంట్స్‌ చేశారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్‌ ఆశలన్నీ సలార్‌ పైనే ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఆ రేంజ్‌ హిట్టు సలారే తెచ్చిపెడుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. అయితే అనూహ్యంగా సలార్‌ కూడా పోస్ట్‌ పోన్‌ అయింది. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు. దీనితో పాటుగా ప్రభాస్‌.. కల్కి, మారుతితో హార్రర్‌ సినిమా చేస్తున్నాడు.

ఇవి రెండు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. కాగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు ఆడియెన్‌ సైతం అమితాసక్తితో చూస్తున్న ప్రాజెక్ట్‌ స్పిరిట్‌. సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాపై జనాల్లో మాములు అంచనాల్లేవు. పైగా ఈ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలిస్‌ గెటప్‌ వేయనున్నాడు. మాములుగానే సందీప్‌ రెడ్డి తన సినిమాల్లో హీరోల క్యారెక్టర్‌ను యాంగర్‌ టోన్‌లో రాసుకుంటుంటాడు. అంటే వీళ్లకు కోపం ముక్కువిూదే ఉంటుంది.

అలాంటిది పోలిసు పాత్రలో ఇంకేంత యాంగర్‌గా చూపించబోతున్నాడో అని అప్పుడు డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఊహల్లోకి తేలిపోతున్నారు. ప్రస్తుతం సందీప్‌తో యానిమల్‌ సినిమా చేస్తున్నాడు. డిసెంబర్‌ 1న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాపై నార్త్‌ సహా సౌత్‌ ఆడియెన్స్‌లో కూడా మంచి హైపే నెలకొంది.

ఇక ఈ సినిమా పూర్తవ్వగానే సందీప్‌ రెడ్డి స్పిరిట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ చేయబోతున్నాడట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జూన్‌ నుంచి ప్రారంభించబోతున్నట్లు చ్రిత నిర్మాత భూషణ్‌ కుమార్‌ వెల్లడిరచాడు. ఈ వార్తతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకుంటున్నారు.