Tron Ares: డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ నుంచి వస్తున్న మెగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ట్రాన్: ఆరీస్” తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రోన్ సిరీస్‌లో ఇది మూడవ భాగం కాగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా కథలో ఓ ఏఐ ప్రోగ్రామ్ – ఆరీస్ మానవుల ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ ఏం చేయబోతున్నాడన్నదే ప్రధాన ప్లాట్. ఆకాడమీ అవార్డ్ విన్నర్ జారెడ్ లేటో ఆరీస్ పాత్రలో మెరిసిపోనున్నాడు. అలాగే, జెఫ్ బ్రిడ్జస్ మరోసారి ట్రాన్ యూనివర్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు స్పెషల్ ట్రీట్.

Tron: Ares | Official Telugu Trailer | In Cinemas October 10

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, విఎఫ్‌ఎక్స్ అన్నీ అద్భుతంగా ఉండటంతో, సినిమా స్థాయిపై హైప్ పెరుగుతోంది. ముఖ్యంగా నైన్ ఇంచ్ నెల్స్ రూపొందించిన “As Alive As You Need Me To Be” అనే పాట ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌లో వైరల్ అవుతోంది.

ట్రాన్: ఆరీస్ సినిమా అక్టోబర్ 10, 2025న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఇండియన్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

దాదాపు పదేళ్ల తర్వాత ట్రాన్ సిరీస్‌కు వచ్చిన ఈ సరికొత్త వర్షన్‌పై గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

TDP Leader Sampath Raju Reacts On YS Jagan Over Comments On CM Chandrababu Naidu || AP News || TR