మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘విశ్వంభర’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి విశ్వంభర టీమ్ అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటుంది.

ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌ లో వేసిన మ్యాసీవ్ సెట్ లో షూట్ జరుగుతోంది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ‘విశ్వంభర’ సెట్స్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ వశిష్ట కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, వి వి వినాయక్ కలసివున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.

విశ్వంభరలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో