ఆగస్ట్ 4న ‘దయా’ అందరినీ థ్రిల్‌కు గురి చేస్తుంది.. రమ్య నంబీషన్

జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ వంటి వారు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ ఆగస్ట్ 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను పవన్ సాధినేని తెరకెక్కించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రమ్య నంబీషన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

నా పేరు రమ్య నంబీషన్. నేను ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాలు చేశాను. ‘దయా’తో తెలుగులోకి వస్తున్నాను. ఇందులో నేను కవిత అనే జర్నలిస్ట్‌ పాత్రను పోషించాను. నేను ఏ పాత్రకు కనెక్ట్ అయితే ఆ సినిమాను చేస్తాను. పవన్ గారు నాకు ఈ కథను చెప్పినప్పుడు షాక్ అయ్యాను. తెలుగు పరిశ్రమ నుంచి ఒక ఆఫర్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతీ కారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. చివరి వరకు బిగపట్టుకుని చూసేలా ఉంటుంది.

తెలుగులో సారాయి వీర్రాజు అని ఓ సినిమాను చేశాను. కానీ నాకు నచ్చే పాత్రలు ఎక్కువగా రాకపోవడంతే ఇక్కడ సినిమాలు చేయలేదు. తమిళం, మలయాళంలో సినిమాలు చేశాను. అయితే ఇప్పుడు దయా వెబ్ సిరీస్ ఏడు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియన్ యాక్టర్స్ అయ్యారు.

జేడీ చక్రవర్తి గారి పక్కన ఉంటేనే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆయనతో నాకు ఎక్కువ సీన్లు ఉండవు. మళ్లీ తనతో కలిసి నటించాలని ఉంది. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు తెలుగులో నాని అంటే ఇష్టం.

బెంగాలీలో వచ్చిన ‘థక్దీర్’కు రీమేక్ అయినా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అందులోని సారాన్ని మాత్రమే తీసుకుని పవన్ ఈ స్క్రిప్టును కొత్తగా మలిచారు.

ఇషా రెబ్బా, విష్ణు ప్రియ, నాకు ఇలా అందరికీ మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించాయి. పవన్ గారు మహిళలకు మంచి పాత్రలను ఇచ్చారు. ఒక్క పాత్ర చుట్టూ తిరిగే కథ కాదు. ప్రతీ కారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుంది.

నేను నా కెరీర్‌లో ఇంత వరకు ఇలాంటి ఇంటెన్స్, సీరియస్ పాత్రను చేయలేదు. కవిత పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఓ లేడీ జర్నలిస్ట్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయ్ అనేది చక్కగా చూపించారు. దయా అనేది అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

ఓటీటీ ఫ్లాట్ ఫాం రావడంతో చాలా మందికి అవకాశాలు పెరిగాయి. నిజంగానే ఓటీటీ అనేది ఓ గొప్ప పరిణామం. అందరికీ కొత్త అవకాశాలు వస్తున్నాయి. సరిహద్దులు చెరిగిపోయాయి.

భరద్వాజ్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. పాటలు బాగుంటాయి. విజువల్స్, ఆర్ఆర్ ఈ వెబ్ సిరీస్‌కు బ్యాక్ బోన్‌లా నిలుస్తాయి. ప్రతీ డిపార్ట్మెంట్ అద్భుతంగా పని చేసింది. అందరి సమష్టి కృషితోనే వెబ్ సిరీస్ అద్భుతంగా వచ్చింది.

దయాను చూస్తే కచ్చితంగా థ్రిల్ అవుతారు. ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను చూసిన తరువాత కచ్చితంగా షాక్ అవుతారు. ఆ థ్రిల్ కోసమే చూడాలి. ప్రస్తుతం హాట్ స్టార్ దూసుకుపోతోంది. అన్ని భాషల్లో హాట్ స్టార్ హాట్ టాపిక్ అవుతోంది. హాట్ స్టార్ నిజంగానే హాట్.

పుష్ప సినిమా కోసం మలయాళంలో ఊ అంటావా అనే పాట పాడాను. అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. అదంతా దేవీ శ్రీ ప్రసాద్ వల్లే జరిగింది. డియర్ కామ్రేడ్ సినిమాలోనూ మలయాళీ వర్షెన్‌కు ఓ పాట పాడాను.