సుజిత్ PK.. ఎంతవరకు వచ్చిందంటే..

పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీ సుజీత్ డైరెక్షన్‌ లో తెరకెక్కనున్న మూవీ నుండి ఫ్యాన్స్ కు కిక్ ఎక్కించే అప్డేట్ వచ్చింది. పవన్ – సుజీత్ మూవీ ఈ నెల 30న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త కాంబినేషన్ గురించి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించబోతున్నారన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో నెలకొంది. నిర్మాత డీవీవీ దానయ్య ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబోలో వస్తున్న మూవీ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ గా తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తి భిన్నంగా ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో మూవీ వస్తుందని ఎవరూ అనుకోలేదు. అనూహ్యంగా ఈ కాంబినేషన్ తెరపైకి రావడం, అది కూడా ఈ నెల చివరి నుండి ప్రారంభం కానుండటంపై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తుతోంది.

ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తియిన తర్వాతే పవన్ కళ్యాణ్.. సుజీత్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ నెల 30న సుజీత్ తో మూవీ ఓపెనింగ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ లేని షూట్ పూర్తి చేసి తర్వాత పీకేతో షూట్ చేయాలని ప్లాన్ వేశారా, లేదా హరిహరవీరమల్లుతో పాటు సుజీత్ సినిమాలు తెరకెక్కించేలా డేట్స్ కుదిరాయా అనేది తెలియాల్సి ఉంది.

సుజీత్ కు డైరెక్టర్ గా అవకాశం వచ్చీ రాగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కథ, ట్విస్టులు ప్రేక్షకునికి ఎక్కకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. సినిమా టేకింగ్ మాత్రం బాగుందన్న ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత సుజీత్ రెండో మూవీయే పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ యాక్టర్ కు టేక్ చెప్పే అవకాశం దక్కింది.

మరోవైపు రాజకీయాలపై దృష్టి సారిస్తూనే హరిహర వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.