నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మించారు.
రీసెంట్‌గా రిలీజైన డెవిల్ మూవీ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఇటీవల మాళవికా నాయర్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా బాలీవుడ్ సెన్సేషన్ ఎల్నాజ్ నోరౌజీ పాత్రను పరిచయం చేశారు. ఈ మూవీలో ఆమె రోజీ పాత్రలో అలరించనుంది.
బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ ఎల్నాజ్ నోరౌజీ మా డెవిల్ చిత్రంలో రోజీ పాత్రలో అలరించనుంది. ఆమె సిల్వర్ స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులను థియేటర్స్ రప్పిస్తుంది. ఆమె ఈ చిత్రంలో తనదైన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనతో ఆకట్టుకోనుంది. దానికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్ పోస్టర్ సాక్ష్యం అంటూ మేకర్స్ ప్రకటించారు.
భారీ బడ్జెట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై డెవిల్ సినిమా రూపొందుతోంది. గాంధీ నడికుడికర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ఆయన అందించిన వర్క్ ఓ విజువల్ ట్రీట్‌ను అందిస్తుంది. సౌందర్ రాజన్.ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డెవిల్ సినిమాను నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఆయన ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్ రామ్ ఆకట్టుకోబోతున్నారు.
దేవాన్ష్ నామా సమర్పకుడిగా.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహిస్తుండగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త, మాళవికా నాయర్ తదితరులు
ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్
సాంకేతిక వర్గం:
సమర్పణ: దేవాన్ష్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
డైరెక్టర్, ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
సీఈఓ : వాసు పోతిని
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: తమ్మిరాజు
స్టోరి డెవలప్‌మెంట్: ప్రశాంత్ బరాడి
కోడైరెక్టర్: చలసాని రామారావు
పి.ఆర్.ఒ: వంశీ కాకా
రీరికార్డింగ్ మిక్స్: ఎ.ఎం.రహ్మతుల్లా, ఎం.రహ్మతుల్లా
స్టంట్స్: వెంకట్ మాస్టర్
పోస్టర్ డిజైన్స్: కన్నీ స్టూడియోస్
డిజిటల్ మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
కాస్ట్యూమ్ డిజైన్స్: అశ్విన్ రాజేష్