‘నాటు.. నాటు…’ గీతం ఆస్కార్ నామినేట్ కావడం ఆనందం కలిగించింది :బాలకృష్ణ

ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని ‘నాటు.. నాటు…’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం గొప్ప ఆనందాన్ని కలిగించిందని హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు. అలాగే డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో నామినేట్ అయిన ‘ ది ఎలిఫెంట్ విష్పర్స్’ చిత్ర బృందాలకు నా అభినందనలు అని తెలిపారు.