అక్షయ్‌కుమార్ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ ట్రైలర్ రిలీజ్ !!!

బాలీవుడ్‌ యాక్టర్స్ అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’. ఈ మూవీకి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజు సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మానుషి ఛిల్లార్‌, అలయ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఈ మూవీని ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ ను గమనిస్తే… స్టన్నింగ్ యాక్షన్‌ సీన్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఆర్మీ పాత్రలో ఫూల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ఈ సినిమాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆజ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీని హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

ఈ సినిమాకు సుల్తాన్, టైగర్ జిందా హై వంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. వశు భగ్నానీ, దీప్షికా దేశముఖ్, జాకీ భగ్నానీ నిర్మించారు. రంజాన్ ఈద్ కానుకగా ఈ చిత్రం.. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Bade Miyan Chote Miyan-OFFICIAL TELUGU TRAILER | Akshay, Tiger, Prithviraj| AAZ |In Cinemas 10th Apr