మేకింగ్ వీడియోతోనే గూస్ బంప్స్.. ఉత్కంఠ పెంచేస్తున్న ‘బడే మియా చోటే మియా’

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ మధ్య విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తేనే ఉత్కంఠ పెరిగిపోయేలా ఉంది. అంత అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. సర్రున దూసుకుపోయే ఫ్లైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు, బ్లాస్టింగ్ సీన్స్ ఒక రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

డైరెక్టర్ అలీ అబ్బాస్ మాట్లాడుతూ.. యాక్షన్ చిత్రాల పట్ల మీకు అంత ఆసక్తి ఎందుకు అంటే నాదగ్గర సమాధానం లేదు. కానీ ఈ చిత్రం యాక్షన్ లవర్స్ కి పండగలా ఉంటుంది అని హామీ ఇచ్చారు. యాక్షన్ ఎక్కువగా ఉన్నపటికీ ప్రతి సన్నివేశం రా, రస్టిక్ గా.. రియలిస్టిక్ గా ఉంటుందని అన్నారు.

ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్ లాంటి ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ఉంటుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.

జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవల యాక్షన్ చిత్రాల ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. మరి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.

BADE MIYAN CHOTE MIYAN - Making Of The REAL ACTION Film | Akshay, Tiger, Prithviraj | EID April 2024