Barabar Premistha: ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా విడుదల.. కాలేజీ స్టూడెంట్స్ నడుమ అట్టహాసంగా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

Barabar Premistha: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్ లో నిర్వహించారు. స్టూడెంట్ తో డాన్సులు చేసిన హీరో హీరోయిన్.. ఆపై ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించి అందరిలో జోష్ నింపారు.

ఈ సందర్భంగా *హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ* .. ”మా సినిమా ప్రమోషన్స్ ఈ కాలేజీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న బారాబర్ ప్రేమిస్తా సినిమాతో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నా. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని చెబుతూ

*హీరోయిన్ మేఘన ముఖర్జీ మాట్లాడుతూ* .. ”అందరికీ థ్యాంక్స్. ఫిబ్రవరి 6న బారాబర్ ప్రేమిస్తా సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నా” అన్నారు.

*డైరెక్టర్ సంపత్ రుద్ర మాట్లాడుతూ* .. ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేదే మా బారాబర్ ప్రేమిస్తా సినిమా. ఇది ప్యూర్ తెలంగాణ బ్యాక్ ఓవర్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. ఫిబ్రవరి 6న అందరూ చూసేయండి అన్నారు.

ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

*నటీనటులు* : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు

*సాంకేతిక వర్గం*

బ్యానర్ : సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్
నిర్మాతలు : గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్
డైరెక్టర్ : సంపత్ రుద్ర
స్క్రీన్ ప్లే : సంపత్ రుద్ర, ఎంఏ తిరుపతి
కథ : ఎంఏ తిరుపతి
డైలాగ్స్:రమేష్ రాయ్
డీవోపీ :వైఆర్ శేఖర్
మ్యూజిక్ : ఆర్ఆర్ ద్రువన్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
పీఆర్ఓ : సాయి సతీష్

Chillagattu Sreekanth About Senior NTR House At Chennai || Balakrishna || NTR || Telugu Rajyam