ఓ యువకుడు డిటెక్టివ్ కావాలనుకుంటాడు. అదే సమయంలో ప్రేమలో పడతాడు. నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడు. అయితే అనుకోకుండా అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. రాత్రి సమయంలో మారేడు కోన అనే ప్రాంతానికి రాకపోకలు నిషేధం. అలాంటి ఊరికి హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది!. అసలు మారేడు కోనకు, మా కథకు ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘అన్వేషి’ సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత టి.గణపతి రెడ్డి.
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను సోమవారం ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. టీజర్‌ను గమనిస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు హీరో డిటెక్టివ్ కావాలనుకుంటాడు. అయితే అనుకోని కారణాలతో తను మారేడు కోనకు వెళ్లాల్సి వస్తుంది. అసలు నిజంగానే ఆత్మలున్నాయా? అనే కోణంలో అన్వేషి సినిమా ఆసక్తికరమైన కథాంశంతో రూపొందినట్లు సన్నివేశాలను చూస్తే స్పష్టమవుతుంది. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల పాత్రలను దర్శకుడు వి.జె.ఖన్నా ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తుంది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్, సైమన్ కింగ్ బీజీఎం, కె.కె.రావు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘నిర్మాతగా అన్వేషి నా తొలి చిత్రం. లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించాం. మా డైరెక్టర్ వి.జె.ఖన్నా మంచి కథ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెడతాయి. షూటింగ్ అంతా పూర్తయ్యింది. హీరో విజయ్, హీరోయిన్స్ సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల అద్భుతంగా నటించారు. చైతన్ భరద్వాజ్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే సైమన్ కింగ్‌గారి బీజీఎం హైలైట్‌గా ఉంటుంది. మా బ్యానర్‌కు అన్వేషి మంచి హిట్ అయ్యి మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు.
నటీనటులు: విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల, అజయ్ ఘోష్, నాగి, హరి కృష్ణ (గృహ లక్ష్మి), ప్రభు, దిల్ రమేష్, చంద్ర శేఖర్ రెడ్డి, రచ్చ రవి, మిమిక్రీ సుబ్బరావు, ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ సత్య తదితరులు
టెక్నీషియన్స్:
బ్యానర్: అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాత: టి.గణపతి రెడ్డి
కో ప్రొడ్యూసర్స్: హరీష్ రాజు, శివన్ కుమార్ కందుల, గొల్ల వెంకట రాంబాబు, జాన్ బోయలపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దుర్గేష్.ఎ
రచన, దర్శకత్వం: వి.జె.ఖన్నా
సినిమాటోగ్రఫీ: కె.కె.రావు
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
బీజీఎం: సైమన్ కింగ్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
లిరిక్స్: చైతన్య ప్రసాద్, చైతన్య వర్మ, శుభం విశ్వనాథ్
స్టంట్స్: జాషువా
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, విద్యాసాగర్ రాజు
పి.ఆర్.ఒ: వంశీ కాకా