Pushpa 2: అల్లు అర్జున్‌ ‘పుష్ప- 2 ది రూల్‌’ ఫస్టాఫ్‌ లాక్‌.. డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల

Pushpa 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్ చిత్రం పుష్ప-2 దిరూల్‌. పుష్ప దిరైజ్‌ సాధించిన బ్లాకబస్టర్ విజయమే అందుకు కారణం. ఆ చిత్రంలోని ప్రతి అంశం సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పుష్ప-2 గురించి ప్రతి అంశం సన్సేషనే.. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

Pushpa 2: 75 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్‌ రూల్‌! పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

డిసెంబరు 6న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్‌ లాక్‌ చేశారు.. ఈ ఫస్ట్‌హాఫ్‌ అద్బుతంగా వుందని, ప్రేక్షకులు ఎంత ఊహించుకున్నా అంతకు తగ్గేదేలే లా వుందని అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాలెన్స్‌ షూటింగ్‌ను జరుపుకుంటునే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబరు 6న పుష్ప-2 క్రియేట్‌ చేయబోయే రిక్డార్డుల గురించి అందరి రెడీ కావాల్సిందే. అంతేకాదు ఈ చిత్రం రిలీజ్‌క ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

క్లైమాక్స్‌ చిత్రీకరణలో ‘పుష్పా2’

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక సిబ్బంది:

కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

మార్కెటింగ్ హెడ్: శరత్ చంద్ర నాయుడు

పిఆర్‌ఓలు: ఏలూరు శ్రీను, మడూరి మధు

మార్కెటింగ్: ఫస్ట్ షో

Producer Chittibabu MASS Warning To Konda Surekha Comments On Samantha & KTR || Revanth Reddy || TR