Akkineni Nageswara Rao: నటసామ్రాట్, లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం శ్రీ సీతా రామజననం 80 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో అత్యంత పిన్న వయస్కుడైన తొలి కథానాయకుడిగా చరిత్ర సృష్టించారు ఎయన్నార్.
తొలి చిత్రంతోనే కథానాయకునిగా శ్రీ రాముని పాత్ర ధరించిన ఏకైక నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడారు.
80 ఏళ్ల క్రితం శ్రీ సీతారామజననం చిత్రంతో కథానాయకుడిగా వెండితెరపై ప్రారంభమైన అక్కినేనినాగేశ్వరరావు గారి ప్రయాణం కోట్లాదిమంది హృదయాలను హత్తుకుంటూ, స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ఎయన్నార్ అసమానమైన వారసత్వం ప్రకాశిస్తూనే ఉంది. అందరి హృదయాలను తాకుతూ, తరతరాలుగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది. ఎయన్నార్ సినీ ప్రస్థానం భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది.