బాలయ్యకు కౌంటర్.. అక్కినేని హీరోల సేఫ్ గేమ్!

నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహా రెడ్డి అక్కినేని తొక్కినేని అనే తరహాలో కామెంట్ చేయడం అక్కినేని అభిమానులను తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురిచేసింది. గతంలో కూడా బాలయ్య బాబు చాలాసార్లు అదుపుతప్పి మాట్లాడారు. అయినప్పటికీ కూడా అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో స్టార్ హీరోలు రియాక్ట్ అయ్యే వరకు కూడా ఫ్యాన్స్ అసలు తగ్గలేదు.

ఇక మొత్తానికి తొక్కినేని వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు పరోక్షంగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. “నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు.. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..” అంటూ అక్కినేని నాగచైతన్య పాటు అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా చాలా సున్నితంగా ఈ విషయంపై బాలయ్య బాబుకు కౌంటర్ ఇచ్చారు.

అయితే ఇంతలా ఈ హీరోలు రియాక్ట్ అయినప్పటికీ అక్కినేని నాగార్జున మాత్రం ఇంకా ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. అసలైతే బాలయ్య బాబు తొందరలో ఫ్లోలో ఆ పదం అని ఉంటారు అని నందమూరి అభిమానులు మరొకవైపు నుంచి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే యువ హీరోలు అదువు తప్పకుండా కౌంటర్ ఇచ్చారు.

ఒక విధంగా అక్కినేని నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా డైరెక్ట్ గా బాలయ్య పేరు ఎత్తి మరి కౌంటర్ ఇవ్వవచ్చు. కానీ అలా రచ్చ చేస్తే అనవసరమైన వివాదాలకు మరింత తావు ఇచ్చినట్లు అవుతుంది. వారు ఇలా ఆలోచించిన విధానం పర్ఫెక్ట్ అని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా ప్రపంచంలో ఇలాంటి విషయాలపై ఎంత సున్నితంగా స్పందిస్తే అంత మంచిది అనే విషయం కూడా తెలిసి ఉండాలి. ఆ విషయంలో ఇద్దరు కూడా పర్ఫెక్ట్ అనిపించారు. మరి బాలయ్య బాబు ఈ విషయంలో మళ్ళీ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.