మలయాళం మూవీ ‘2018’ కేరళలో మే 5న విడుదలైంది. విడుదలైన పది రోజుల్లో వసూళ్ళు వందకోట్లు దాటేశాయి. నేటికి వసూళ్ళు 140 కోట్లకి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వసూళ్ళ సంచలనం సృష్టిస్తున్న ‘2018’ ఇతర భాషల్లో నేడు విడుదలయింది. తెలుగులో దీన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. 2018 లో కేరళ ని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితులు ప్రాణాల కోసం వాళ్ళు చేసిన పోరాటాల్నీ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమా సూపర్ హిట్స్ టాక్ తో సునామీలా దూసుకుని పోతుంది కొన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు అవి వారితో పాటు తీసుకుని వెళ్ళే అనుభూతిని అందిస్థాయి.
ఈ 2018 మూవీ కూడా ఆడియన్స్ కి అటువంటి అనుభూతిని అందిస్తుంది. దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ హృద్యమైన కథని తీసుకున్నారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో పాటు హార్ట్ టచింగ్ సీన్స్, యాక్టర్స్ పెరఫార్మన్సెస్ ప్రతి ఒక్కరినీ సినిమాని ఆకర్షిస్తుంది. టోవినో థామస్ మరొక్కసారి ఈ సినిమాలో తన పాత్రలో జీవించాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్స్ కావడం వల్ల గీతా ఆర్ట్స్ లో అంగరంగ వైభవంగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి .. ఈ సెలబ్రేషన్ లో skn మాట్లాడుతూ….ప్రతి సినిమా బేబీ లాంటిదే క్యాస్టింగ్ పరంగా మల్టీ స్టార్ అవతార్ ఒక యూనివర్సల్ లాగా , ఈ సినిమా ఒక ప్రళయం సృష్టించేలా చేశారు కిందటి సంవత్సరం కంతరా , kgf ఎలా సూపర్ హిట్స్ గా నిలిచాయో , ఈ సినిమా కూడా అలానే నిలిచింది, ఈ సినిమా చూస్తుంటే మనం ఒక ప్రళయంలో ఉన్నట్టు వుంటుంది చలా తక్కువ VFX చలా చేశారు.
2018 ప్రళయం వచ్చినప్పుడు మన టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ , ప్రభాస్ , స్పందించిన సంగతి తెలిసిందే, 2018 నేను కూడా ఆ ప్రళయంలో చిక్కుకునే వాడినే అదృష్టవశాత్తు బయటపడ్డను. సినిమా మార్నింగ్ షో కి 30% ఉంటే మ్యాట్నీ షో కి 60% నిండింది . లాస్ట్ 45 నిమిషాలు ఊపిరి బిగబెట్టుకుని సినిమా చూస్తారు. 150 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా 150 రూపాయలు పెట్టి చూస్తారని కోరుకుంటున్న అని మాట్లాడుతూ ,ఈ కార్యక్రమంలో వంశీ, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు
నటీనటులు: టోవినో థామస్, లాల్, నరైన్, అపర్ణ బాలమురళి, కళైరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ తదితరులు
దర్శకులు : జూడ్ ఆంథనీ జోసెఫ్
నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
సంగీత దర్శకులు: నోబిన్ పాల్
సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్
ఎడిటర్: చమన్ చక్కో