నాగ చైతన్య- నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24 క్రూషియల్ & లెన్తీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

Naga Chaitanya #NC24: యువసామ్రాట్ నాగ చైతన్య ‘తండేల్’ సంచలన విజయం తర్వాత విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లల్ ని చేస్తున్నారు. NC24 ఈ జానర్ ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.

టీం ఇటీవల మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. రషెస్ తో థ్రిల్‌గా ఉంది. ఇప్పుడు, మరింత ఉత్సాహంతో హైదరాబాద్‌లో నెల రోజుల పాటు జరిగే కీలకమైన రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ లో నాగ చైతన్య, ఇతర పరిశ్రమల నుండి ప్రముఖ నటులు కూడా పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. నాగ చైతన్య ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్ పట్టుకుని కనిపిస్తున్న న్యూ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘One step deeper, one swing closer,”అనే లైన్ ఇంట్రస్టింగ్ గా వుంది.

నాగ చైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన ట్రాన్స్ ఫర్మేషన్ బిగ్గెస్ట్ హైలెట్ గా ఉండబోతోంది. ఇది మరింత బజ్‌ను పెంచుతుంది. టైటిల్, ప్రధాన తారాగణాన్ని త్వరలో అనౌన్స్ చేస్తారు.

ఇప్పటికే మేకర్స్ “NC24 – ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్” అనే గ్రిప్పింగ్ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందించగా, రఘుల్ ధరుమాన్ సినిమాటోగ్రఫర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

తారాగణం: నాగ చైతన్య

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రాగుల్ ధరుమన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

సింగయ్య భార్య బిగ్ షాక్ || Analyst Ks Prasad Reacts On Singayya Wife Allegations On Nara Lokesh ||TR