ప్రస్తుత కాలంలో యువతీ యువకులు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి అర్ధరాత్రి సమయం దాకా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ రియల్ చేస్తూ సమయం గడుపుతున్నారు. ఇక యువతి, యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ టాలెంట్ అని నిరూపించుకోవడానికి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేయటానికి కొంతమంది సాహసాలకు వడిగడుతు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రీల్స్ చేస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో శనివారం ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మైన్‌పురి జిల్లాలోని భికాన్‌పుర్ గ్రామానికి చెందిన కరణ్, శశాంక్ అనే ఇద్దరు యువకులు కూలీ పనుల కోసం ధోల్‌పురా గ్రామానికి వెళ్లారు. కూలీ పనుల కోసం వెళ్లిన ఈ యువకులిద్దరూ దగ్గరలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్లి రీల్స్ చేయటం ప్రారంభించారు. ఇలా రైలు పట్టాల మీద రీల్స్ చేస్తూ రైలు వస్తున్న విషయాన్ని గమనించలేకపోయారు. రీల్స్ చేస్తున్న సమయంలో వీరిద్దరూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించకపోవడంతో ప్రమాదవశాత్తు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
ఇలా వీరిద్దరిని రైలు ఢీకొన్న విషయం కొంతసేపటి తర్వాత తోటి కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి వారి వివరాల సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కూలీ పనుల కోసం వెళ్లిన కుమారులు ఇలా శవమై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఇలా ప్రతిరోజు ఎంతోమంది యువతి యువకులు రీల్స్ చేస్తూ తమ టాలెంట్ నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు.