కర్ణాటక అసెంబ్లీలో ఎన్టీఆర్.. ఏపీ అసెంబ్లీలో ఎప్పుడు అడుగు పెడతారో?

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కు నవంబర్ నెల 1వ తేదీన జరగనున్న కార్యక్రమానికి ఆహ్వానం అందిందనే సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న విశిష్ట పురస్కారంను ప్రదానం చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ నుంచి కేవలం తారక్ కు మాత్రమే ఆహ్వానం అందడం గమనార్హం. తనకు ఆహ్వానం అందడంతో తారక్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కర్ణాటకలో కూడా అంచనాలను మించి సక్సెస్ ను అందుకోవడం గమనార్హం. ఈ వేడుకకు తమిళనాడు రాష్ట్రం నుంచి రజనీకాంత్ కు ఆహ్వానం అందింది. అయితే తమకు ఆహ్వానం అందకపోవడంపై కొంతమంది హీరోలు ఫీలవుతున్నారని తెలుస్తోంది.

అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టడం విషయంలో సంతోషిస్తూనే ఆయన ఏపీ అసెంబ్లీలో ఎప్పుడు అడుగు పెడతాడో అంటూ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తారక్ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో తారక్ పోటీ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాజకీయాల విషయంలో తారక్ మనస్సులో ఏముందో క్లారిటీ రావాల్సి ఉంది. పాలిటిక్స్ లోకి తారక్ వస్తే తారక్ సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎంతో సమయం పట్టదని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తారక్ కు సోషల్ మీడియాలో కూడా భారీ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.