ఈ మత్స్య యంత్రం ఛేదించింది అర్జునుడా…కృష్ణుడా……

(గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి)

కర్నాటక లోని హసన్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం హరణహల్లి…అక్కడున్న లక్ష్మినరసింహ,చెన్నకేశవ,గోపాలకృష్ణుల త్రికూటాలయం..హళేబీడు లోని హోయసలేశ్వర ఆలయం…బేలూరులోని చెన్నకేశవాలయం లో ఉన్న మత్స్యయంత్ర ఛేదన శిల్పాలు ఇవి..ఇంతకూ ఈ శిల్పాలు అర్జునుడివా?కృష్ణుడివా?

 

ముందు ఈ కృష్ణుడి కథ తెలుసుకోండి…

శ్రీకృష్ణుడి అష్ట భార్యల,పెళ్లి గురించీ బోలేడు కథలు…ఆ భార్యల్లో ఒకావిడ లక్షణ/లక్ష్మణ…ఈవిడ మద్ర దేశ రాకుమారి…పాండవులు,కౌరవులూ ఆ స్వయంవరానికి వెళ్లినా అక్కడ మత్స్యయంత్రం ఛేదించి ఆమెను చేపట్టినవాడు కృష్ణుడు…

సరే..మీరు అడగవచ్చు…అర్జునుడు ఎందుకు కాకూడదని?

 

ఇప్పుడు మహాభారతంలో కథ పరిశీలిస్తే..లాక్షాగృహం నుంచి తప్పించుకున్న పాండవులు,కుంతీదేవి ఒక అడవి చేరారు..అక్కడ  హిడింబాసుర వధ, ఆ పైన భీముడికి హిండింబితో పెళ్లి జరుగుతుంది…

ఆ తర్వాత వారు బ్రాహ్మణ వేషాలు ధరించి ఏకచక్రపురం చేరుతారు..అక్కడ బకాసుర వధ కథ తెలిసిందే..ఆ తర్వాత ద్రౌపది స్వయంవరం గురించి తెలుసుకుని వెళతారు..అక్కడ మత్స్యయంత్ర ఛేదన చేస్తాడు అర్జునుడు..బ్రాహ్మణులకుని మిగిలిన రాజులు దాడి చేయబూనుకోవడం..వారిని పాండవులు ఓడించి కుంతి దగ్గరకు తీసుకుపోవడం..బిక్ష అనుకున్న కుంతి అందరినీ సమానంగా పంచుకొమ్మనడం..తెలిసిన కథే..వీరి అసలు విషయం తెలుసుకోవాలునుకుని వెళ్లిన ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడికి అసలు నిజం అప్పుడు తెలుస్తుంది..

మరి అంతవరకూ బ్రాహ్మణ వేషధారణలో అర్జునుడుండగా ఈ శిల్పంలో వేషధారణ, కత్తులూకటార్లూ ఎలా సాధ్యం?

 
మరి ఇవి కృష్ణుడి శిల్పాలే అనుకోవాలా?

కాదు..ఆ పక్కన హనుమంతుడు ఉన్నాడు కాబట్టి కపిధ్వజుడు అర్జునుడే అనుకోవచ్చు..

ఇక కిరీటాలు,కత్తి వగైరా ఆభరణాలు శిల్పి అతిశయోక్తి కావొచ్చు….లేదా …బ్రాహ్మణ,క్షత్రియ వేషధారణ ఒకానొక కాలంలో ఒకే విధంగా ఉండేదా!!! మీరేమంటారు????