కృష్ణుడి గెట‌ప్‌లో మ‌హేష్ బాబు.. సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండ‌స్ట్రీలోకి రాజ‌కుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప‌ర్వాలేద‌నిపించిన మ‌హేష్ కు పెద్ద‌గా క్రేజ్ తీసుకురాలేక‌పోయింది. పోకిరి సినిమాతో మ‌హేష్ మాస్ హీరోగా మార‌డంతో ఆయ‌న‌కు విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా మారిన మహేష్ ప్ర‌స్తుతం బాక్సాఫీస్ రికార్డుల‌ని తిర‌గ‌రాస్తున్నారు. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో అల‌రించిన ఆయ‌న త్వ‌ర‌లో సర్కారు వారి పాట చిత్రంతో అల‌రించ‌నున్నాడు.

మ‌హేష్ బాబు అతి త్వ‌ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. రాజ‌మౌళి సినిమాలు అంటే భారీ బ‌డ్జెట్‌తో పాటు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంటాయి. ఇప్పుడు మ‌హేష్ తో కూడా వైవిధ్యంగా సినిమా రూపొందించ‌నున్నార‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఏ క‌థ‌తో మహేష్ హీరోగా రాజ‌మౌళి సినిమా చేయ‌నున్నాడ‌నే విష‌యం తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ అభిమానులు మాత్రం అనేక ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

మ‌హేష్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఆయ‌న‌ని కొన్ని ముఖ్య పాత్ర‌ల‌లో చూడాల‌ని ఎప్ప‌టి నుండో క‌ల‌లు కంటున్నారు. అయితే కృష్ణుడి గెట‌ప్‌లో మ‌హేష్ చాలా అందంగా ఉంటాడ‌ని చర్చ ఎప్పటి నుండో న‌డుస్తున్న‌ప్ప‌టికీ, దీనిపై పెద్ద‌గా ఎవ‌రు ఆస‌క్తి చూప‌లేదు. అయితే త‌న అభిమాన హీరో కృష్ణుడి రూపంలో చాలా అందంగా ఉంటాడంటూ ఓ అభిమాని ఫొటో ఎడిట్‌ రూపంలో ఎలివేట్‌ చేశాడు. ఈ ఫోటో చూసి సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా మురిసిపోతున్నారు. కృష్ణుడిగా మ‌హేష్ లుక్ అదిరింద‌ని, ఆయ‌న చేత భవిష్య‌త్‌లో కృష్ణుడి పాత్ర చేయించాలంటూ నెటిజ‌న్స్ రిక్వెస్ట్‌లుచేస్తున్నారు.