భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ పంపారు. ఢిల్లీ పోలికే కమిషనర్ అమూల్య పట్నాయక్ కు ఈమెయిల్ ద్వారా ఈ లేఖను పంపారు. అధికారి అమూల్య పట్నాయక్ కు పంపిన ఈ బెదిరింపు లేఖలో 2019 నవంబర్ లో మోదీని చంపేస్తామంటూ వారు పేర్కొన్నట్టు సమాచారం.
ఈ బెదిరింపు మెయిల్ తో ప్రధాని భద్రతా సంస్థలు అలెర్ట్ అయ్యాయి. ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మోదీ పలు ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హై ఆలేరు విధించినట్టు సమాచారం.
అధికారుల ప్రాధమిక విచారణలో అస్సాం సర్వర్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు తేల్చారు. కాగా ఈమెయిల్ పంపిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ కు మెయిల్ రాగానే దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇటీవలే “రాజీవ్ గాంధీ తరహాలోనే మోదీని హత్య చేస్తామంటూ” మావోయిస్టులు కుట్ర పన్నినట్టు తమకు లేఖ దొరికిందని పుణె పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసు అధికారులు అలెర్ట్ అయ్యారు. దేశ ప్రధానిని చంపేస్తామంటూ వస్తున్న బెదిరింపులతో అధికారులు హైరానా పడుతున్నారు. కుట్ర పన్నిన వ్యక్తుల్ని చేధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వార్త బయటకు రావడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.