అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రతీకార పన్నులతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నాడు. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” నినాదంతో ఆయన విదేశాలపై భారీ టారిఫ్‌లను ప్రకటించాడు. భారత్, చైనా సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో చైనాపై 34%, భారత్‌పై 26% పన్నులు ఉండగా, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడించాడు. దీనివల్ల అమెరికాలో అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
వాహన రంగంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావం గణనీయంగా ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే కార్లు, విడిభాగాలపై 25% పన్ను విధించడంతో కార్ల ధరలు 2,500 డాలర్ల నుంచి 20,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో తయారీ సంస్థలు కూడా విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో వారి ఖర్చులు కూడా పెరిగేలా ఉన్నాయి.
దుస్తులు, షూస్ వంటి ఉత్పత్తులు ప్రధానంగా చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. ఈ దేశాలపై ట్రంప్ భారీ టారిఫ్‌లు విధించడంతో అమెరికాలో వస్త్ర ధరలు, షూల ఖరీదు పెరగనుంది. అంతేకాకుండా, బ్రెజిల్, కొలంబియా దేశాల నుంచి దిగుమతయ్యే కాఫీపై 10% పన్ను విధించడంతో కాఫీ ధరలు కూడా బరువు కానున్నాయి.
ఇంధన రంగాన్ని చూస్తే… కెనడా నుంచి దిగుమతయ్యే చమురుపై 10% టారిఫ్ విధించడంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం తప్పదు. అదే విధంగా, మెక్సికో నుంచి దిగుమతయ్యే అవకాడో ఫలాలపై ప్రభావం ఉండే సూచనలు ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ప్రజలకు ఖర్చు భారం పెరగనుండటమే కాకుండా, ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.