‘ది కేరళ స్టోరీ’ నిజమైన కథ కాదా.?

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ది కేరళ స్టోరీ’.. అంటూ ప్రచారం జరిగింది. సినిమా నిర్మాణం కోసం ఎంత కష్టపడ్డారోగానీ, అంతకు మించి కష్టపడ్డారు సినిమా ప్రచారం నిమిత్తం.!

రాజకీయ పార్టీలు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొన్ని పార్టీలు ఈ సినిమాని ప్రమోట్ చేస్తే, ఇంకొన్ని పార్టీలు ఈ సినిమాకి నెగెటివ్ పబ్లిసిటీ ఇచ్చాయి. కొన్ని మత సంఘాలు సినిమాపై బురద చల్లితే, ఇంకొన్ని మత సంఘాలు ఈ సినిమా పట్ల సానుకూలంగా స్పందించాయి.

ఇంతకీ, ‘ది కేరళ స్టోరీ’లో నిజమెంత.? వేల మంది యువతులు బలవంతంగా మత మార్పిడికి గురై, ఆ తర్వాత ఇస్లామిక్ టెర్రరిజం చేతికి చిక్కారన్నది ఈ సినిమాలో అసలు కథాంశం. దీనిపై కొందరు గుస్సా అయ్యారు. కొంతమంది నిజమేనన్నారు.

సాధారణంగా ఇలాంటి సినిమాల విషయంలో ‘వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కల్పిత కథ’ అనేస్తే ఎలాంటి సమస్యా వుండదు. కానీ, వాస్తవ కథ.. అనడంతోనే అసలు సమస్య వచ్చిపడింది.

నిజానికి, కేరళలో మత మార్పిడులు జరిగాయి, జరుగుతూనే వున్నాయి. సినిమాలో హిందూ యువతుల్ని ముస్లిం మతంలోకి మార్చి, ఐసిస్‌లోకి పంపించడాన్ని చూపించారు. కానీ, వేల సంఖ్యలో.. లక్షల సంఖ్యలో హిందూ యువతుల్ని క్రిస్టియానిటీ వైపు మార్చుతున్నారు.

రాజకీయ కోణంలో ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కిన మాట వాస్తవం. అందుకే, ‘వాస్తవం’ ఇంత రచ్చకు కారణమవుతోంది.