మన జాతీయ గీతాన్ని సూపర్‌గా పాడిన విదేశి అమ్మాయి (వీడియో)

జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత… పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ… ఇది భారత జాతీయ గీతం.  ఈ గీతాన్ని భారతీయులే కాదు విదేశీయులు కూడా పాడుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన పులి శ్రవణ్ కుమార్ తాత్వియా దేశస్థురాలైన ఐగా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐగా మెట్టినిల్లు అయిన ఇండియా మీద ప్రేమతో భారత జాతీయ గీతాన్ని నేర్చుకుంది. చక్కగా పాడుతూ అందరి అభినందనలు పొందుతుంది ఐగా పులి. ఐగా పాడిన జనగణమన వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి.

వరంగల్ కు చెందిన శ్రవణ్ కుమార్ తన చదువు నిమిత్తం స్వీడన్ వెళ్లాడు. అక్కడే తాత్వియా దేశానికి చెందిన ఐగా పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. వీరికి ఒక బిడ్డ, కొడుకున్నారు. వీరు ప్రస్తుతం లండన్ లో స్థిర నివాసం ఏర్పరుచుకొని అక్కడే ఉద్యోగం చేస్తు ఉంటున్నారు.

 

పిల్లలతో పులి శ్రవణ్, ఐగా దంపతులు

ఐగా ఇండియా కల్చర్ కు తెగ ఫిదా అయిపోయింది. తన అత్తమామలను కూడా ఐగా చాలా బాగా చూసుకుంటుందని శ్రవణ్ స్నేహితుడు గణపతి తెలిపారు. ఈ దంపతులు చేసేవి చిన్న పనులైనా వారు చాలా ఆనందంగా బతుకుతారని ఆయన తెలిపారు. లాత్వియా దేశస్థురాలైన ఇండియా జాతీయ గీతాన్ని చక్కగా ఆలపిస్తుండటంతో అందరూ ఐగాను అభినందిస్తున్నారు.