స‌చిన్ టెండూల్క‌ర్‌పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

అంతర్జాతీయంగా పేరున్న క్రీడాకారుణ్ణి సైతం కాస్టింగ్ కౌచ్ అంశం వదల్లేదు. శ్రీరెడ్డి మరొక సంచలన పోస్టు పెట్టింది. ఈసారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల గురించి కాదు. ఇండియన్ క్రికెట్ ఆటగాడిపై పోస్టు పెట్టి షాక్ ఇచ్చింది. క్రికెట్ వీరాభిమానులకు కోపం తెప్పించే పోస్టు పెట్టింది. చాలామంది క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవంపైన వివాదాస్పద పోస్టు పెట్టి దుమారం రేపింది శ్రీరెడ్డి.
 
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే సచిన్ టెండూల్కర్ గురించి విస్తుపోయే పోస్టు పెట్టింది. ఆ పోస్టు సారాంశం ఇదే… “సచిన్ టెండూల్కర్ అనే రొమాంటిక్ వ్యక్తి హైదరాబాద్ వచ్చినప్పుడు, అతనితో చార్మింగ్ గర్ల్ రొమాన్స్ చేసింది. వీరిద్దరికి మధ్యవర్తిగా క్రికెట్ కి సంబంధించిన మరో ప్రముఖవ్యక్తి చాముండేశ్వర్ స్వామి ఉన్నారు. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు…నా భావం రొమాన్స్ బాగా చేస్తారు. అని పోస్టు పెట్టింది.
 
అయితే శ్రీరెడ్డి తన పోస్టులో చార్మింగ్ గర్ల్ లో ఛార్మి అనే అక్షరాల పక్కన అఫాస్టాఫియస్ తో సెపరేట్ చేసింది. దీంతో అందరూ ఆ చార్మింగ్ గర్ల్ ఛార్మి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు క్రికెట్ అభిమానులు మాత్రం సచిన్ గురించి ఇలాంటి పోస్టు పెట్టినందుకు శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ లెవెల్ లో పబ్లిసిటీ కోసం సచిన్ గురించి ఇలా దుష్ప్రచారం చేస్తావా అంటూ ఆమెపై మంది పడుతున్నారు. శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ కింద ఉండ చూడండి.