కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించారు. భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరైన కొద్ది సేపటికే ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపట్టారు. ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. రాబర్ట్ వాద్రా విచారణలో ఏం జరుగుతుందో అందరికి తెలుసని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రియాంక పార్టీ బాధ్యతలు స్వీకరించడంతో కాంగ్రెస్ లో మరో కొత్త శకం ప్రారంభమైందని పలువురు అన్నారు.

యూపీఏ హాయాంలో  జరిగిన పలు ప్రాజెక్టులలో భారీ ముడుపులు అందుకున్నారని రాబర్ట్ వాద్రా పై అభియోగాలున్నాయి. దీంతో ఈడీ రాబర్ట్ వాద్రాను విచారిస్తుంది. రాబర్ట్ వాద్రాను ఈడీ ఆఫీసులో స్వయంగా ప్రియాంక గాంధీ దింపి వెళ్లారు. భర్తను ఈడీ ఆఫీసు దగ్గర వదిలిన కాసేపటికే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లి ప్రియాంక గాంధీని పార్టీ బాధ్యతలు స్వీకరించాలని ఆహ్వానించారు. దాంతో అమెరికా నుంచి తిరిగొచ్చిన ప్రియాంకా గాంధీ బాద్యతలు స్వీకరించారు. ముందుగా ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించారు.