కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధానమంత్రి మాతృ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. గర్భిణీ స్త్రీలు ఈ పథకంలో చేరడానికి అర్హత కలిగి ఉండటంతో పాటు ఈ పథకం యొక్క బెనిఫిట్స్ ను పొందడానికి కూడా అర్హత కలిగి ఉంటారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా అర్హత ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ఖాతాలలో రూ.5 వేలు చేరే అవకాశం అయితే ఉంటుంది. విడతల వారీగా ఈ డబ్బులు ఖాతాలలో జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. మొత్తం మూడు విడతలలో ఖాతాలలో ఈ నగదు జమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తొలి విడతలో ఖాతాలో 1000 రూపాయలు నగదు జమవుతుంది.
రెండో విడతలో 2000 రూపాయలు నగదు జమవుతుండగా మూడో విడతలో మరో 2000 రూపాయలు నగదు జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆన్ లైన్ లో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజిష్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ అమలవుతుండగా తొలి ప్రసవానికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎంసీపీ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఆశ వర్కర్, అంగన్ వాడీ వర్కర్లను కలిసి ఈ స్కీమ్ బెనిఫిట్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలను తెలుసుకోవచ్చు. గర్భిణీ మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ఎంతగానో బెనిఫిట్ కలగనుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందలేరు.