ఫేక్ న్యూస్ నుంచి దేశాన్ని కాపాడండి… సుప్రీంకోర్టులో పిటిషన్

ఇండోపాక్ ఉద్రికత్తలు పెరిగిపోయేందుకు సోషల్ మీడియాల వచ్చిన ఫేక్ న్యూస్ కూడా కారణమేనని చెబుతూ ఫేక్ న్యూస్ ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్ ) దాఖలయింది. అనుజా కపూర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేస్తూ ఇండో పాక్ ఉద్రిక్తత మీద గతం వారం రోజులు దుష్ప్రచారం వరదలై పారిందని పేర్కొన్నారు.

‘ఎప్పడో వచ్చిన ఎయిర్ షోల వీడియోలు, ఎక్కడో కూలిపోతున్న యుద్ధవిమానాల ఫోటోలు తాజా ఫోటోలని రెండుదేశాలలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య ఉద్రికత్తను పెంచుతూ గత మంగళవార నుంచి సోషల్ మీడియా అనేది అచ్చం యుద్ధభూమి అయిపోయింది. నిజమేదో తెలుసుకోవాలనే వాళ్లు కూడా ఈ దుష్ప్రచారం, బోగస్ వార్తల వెల్లువలో కొట్టుమిట్టారు,’అని పిటిషనర్ పేర్కొన్నారు.

రకరకలా సోషల మీడియా వేదికల మీదనుంచి శరవేగంగా ప్రయాణించే ఈ ఫేక్ న్యూస్ ను నియంత్రించేందుకు ప్రస్తుతం దేశంలో చట్టాలేమీ లేవని పిటిషన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సమాచారం వినియోగం కోసం అవసరమయిన మార్గదర్శక సూత్రాలను, నియమాలను రూపొందించేలా ప్రభుత్వాన్ని అదేశించాలని ఆమె కోర్టును కోరారు. అంతేకాదు, రకరకాల హ్యండిల్స్ మీద వస్తున్న ఫేక్ న్యూస్ కన్నేసి ఉంచేందుకు ఒక కమటీ కూడా ఉండాలని ఆమె కోరారు.