భారత్ పైలట్ అభినందన్ రేపు విడుదల

పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నారు ఈవిషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రకటించారు.  స్నేహపూర్వకంగా ఆయనను విడదలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.  ఈరోజు  ఆయన పార్లమెంటులో రెండు దేశాల మధ్య  నెలకొన్న పరిస్థితుల మీద  ప్రసంగించారు.

 

భారత పైలట్ కు ఎలాంటి హాని చేయకుండా విడుదల చేయాలని భారత్ చెప్పినతర్వాత పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఒక మెలికతో విడుదల చేసేందుకు సముఖత వ్యక్తం చేశారు. విడుదల వల్ల పరిస్థితులు మెరుగుపడతాయని గ్యారంటీ ఉండే ఆ పని చేస్తామన్నారు. ఆశ్చర్యంగా, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లొనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్  అభినందన్ ను విడుదలచేస్తున్నామని ప్రకటించారు.

’రెండు దేశాల మధ్య ఉద్రికత్త మాకు ఇష్టం లేదని చెప్పేందుకు నేను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఉద్రికత్త వద్దని చెప్పడంమంటే మేం భయపడుతున్నట్లు కాదు,’ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.

“I reached out to New Delhi after assuming charge as prime minister. I wrote to Narendra Modi and suggested a meeting between the foreign ministers on the sidelines of the United Nations General Assembly. But we did not get a positive response,”

అని ఆయన పార్లమెంటు సంయుక్త సమావేశం లో ప్రసంగిస్తూ చెప్పారు.

ఇపుడు పాక్ , ఇండియా మధ్య మొదలయినఉద్రికత్త గురించి సెనేట్, నేషనల్ అసెంబ్లీ సభ్యులకు వివరించేందుకు ఆయన సంయుక్త సమావేశంలో ప్రసంగిచారురని ట్రిబ్యూన్  రాసింది. 

’మా శాంతి ఆకాంక్షకు తగ్గట్టుగా, రేపు , చర్చలకు రంగం సిద్ధం చేసే దిశలో మొదటి అడుగు వేస్తూ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ను,  పాకిస్తాన్ రేపు విడుదల చేస్తుంది,’ అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారని డాన్ రాసింది.

“In our desire for peace, I announce that tomorrow, and as a first step to open negotiations, Pakistan will be releasing the Indian Air Force officer in our custody,” PM Khan said.

మా దగ్గిర ఒక ఇండియన్ పైలట్ ఉన్నారు. ఆయనను స్నేహపూర్వకంగా రేపు విడుదల చేస్తాం అని ప్రధాని ఇమ్రాన్ ప్రకటించారు. ప్రధాని ప్రకటనకు పార్లమెంటులో సంపూర్ణ మద్ధతు లభించింది.

అంతకుముంద ఆయన పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నేతలతో రహస్య సమావేశం నడిపి  సరిహద్దు వెంబడి నెలకొన్న పరిస్థితులను వివరించారు.

ఇది కూడా చదవండి

అల్లరి మూకల చేతినుండి అభినందన్ ఎలా బయటపడ్డాడు…