తనకి నోబెల్ శాంతి బహుమతి తీసుకునే అర్హత లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా ఎవరు పరిష్కరిస్తారో వాళ్లకే నోబెల్ శాంతి బహుమతి రావాలని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్ ల మధ్య తలెత్తిన వివాదాన్ని ఒక కొలిక్కితీసుకువచ్చేందుకు పాక్ బందీ గా పట్టుకున్న భారత్ పైలట్ అభినందన్ వర్థ మాన్ ను విడుదల చేస్తామని ప్రకటించినప్పటినుంచి ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆదేశంలో హ్యాష్ టాగ్ #NobelPeaceForImranKhan తో సంతకాల ఉద్యమం మొదయింది.
అంతేకాదు, పార్లమెంటులో కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.
దీనికి స్పందిస్తూ ఈరోజు ఇమ్రాన్ ఈ ప్రకటన చేశారు.‘నోబెల్ పురస్కారం స్వీకరించేంత పెద్దవాడిని కాదు నేను. కాశ్మీరీ ప్రజల అభీష్టానుసారం కాశ్మీర్ సమస్యను పరిష్కరించి ఉపఖండంలో శాంతి, మానవాభ్యుదయం కోసం బాట వేసిన వారికే నోబెల్ గౌరవం లభించాలని,’ అని ఆయన ట్వీట్ చేశారు.
“The person worthy of this [Nobel Peace Prize] would be the one who solves the Kashmir dispute according to the wishes of the Kashmiri people and paves the way for peace & human development in the subcontinent”.
I am not worthy of the Nobel Peace prize. The person worthy of this would be the one who solves the Kashmir dispute according to the wishes of the Kashmiri people and paves the way for peace & human development in the subcontinent.
— Imran Khan (@ImranKhanPTI) March 4, 2019
భారత పైలట్ ను విడుదల చేస్తున్నామని ఫిబ్రవరి 28న చేసిన ప్రకటనతో రెండు దేశాల మధ్య పుల్వామా అనంతరం చెలరేగిన ఉద్రిక్తత తగ్గిపోయిందని చెబుతూ ఈచర్య కు గుర్తింపు గా ఆయన నోబెల్ బహుమతి ఇవ్వాలని పాక్ సమాచార శాఖ మంత్రి ఈ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు.