“మహానటి” చిత్రానికి జాతీయ అవార్డులు
చాలాకాలంగా ఎదురు చూస్తున్న 66వ జాతీయ సినిమా అవార్డులను శుక్రవారం రోజు న్యూఢిల్లీలో ప్రకటించారు . ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా గుజరాత్ మూవీ ” హెల్లరో ” ఎంపికయ్యింది . అలాగే మొదటి చిత్రం దర్శకుడుగా సుధాకర్ రెడ్డి ఎక్కంటి ఎంపికయ్యారు వీరు మరాఠీలో నిర్మించిన నాల్ చిత్రానికి ఈ పురస్కారం లభించింది . ఉత్తమ ప్రజాదరణ కలిగిన సినిమాగా హిందీలో నిర్మాణమైన బడాయి హో ఎంపికైంది . .ఉత్మ దర్శకుడుగా “యూరి ,ది సర్జికల్ స్ట్రైక్ ” ఆదిత్య ధర్ ఎంపికయ్యారు .
ఉత్తమ జాతీయ సమగ్రతా సినిమాగా “ఒండల్లా ఎరడల్లా” అనే కన్నడ సినిమా ఎంపికైంది . ఉత్తమ నటుడు అవార్డు ఆయుష్మాన్ ఖురానా ,నిక్కీ కౌశల్ గెలుచుకున్నారు . మహానటి చిత్రంలో నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయింది .
ఇక తెలుగులో చి ,ల .సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది . రంగస్థలం లో ఉత్తమ నేపధ్య సంగీతానికి అవార్డు లభించింది . అలాగే మహానటి సినిమాకు కాస్ట్యూమ్ , మేకప్ విభాగాల్లో మరో రెండు అవార్డులు లభించాయి .