వాళ్లకు రూ.15 లక్షలు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఏం జరిగిందంటే?

మన దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తీవ్రమైన క్యాన్సర్ ఉన్న రోగులకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద కేంద్రం ఈ మొత్తాన్ని అందిస్తోందని సమాచారం అందుతోంది. రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

రేషన్ కార్డును కలిగి ఉండటంతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కు సంబంధించిన బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సాధారణంగా క్యాన్సర్ రోగులు ఖరీదైన ఔషధాలను వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఔషధాల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. ఏపీ నుంచి ఈ పథకం ద్వారా ఏకంగా 95 మంది ఇప్పటివరకు ప్రయోజనం పొందారు.

ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఆర్థిక సాయం కావాలంటే చికిత్స అందించే డాక్టర్, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్ సంతకాలు, ఇతర వివరాలను జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ తో పాటు ఆదాయ ధృవ పత్రాలను జత చేసి హెల్త్ మినిష్టర్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా క్యాన్సర్ రోగులకు ఎంతగానో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. క్యాన్సర్ రోగులకు ఎన్నో బెనిఫిట్స్ కలిగేలా వాళ్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. మోదీ సర్కార్ సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తీసుకుంటున్న నిర్ణయాలపై పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.