పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆ రోజు మోదీ సహచరులతో చర్చించాకే ప్రత్యేక హోదా హామీనిచ్చాం మరీ ఈనాడు దానిని ఎందుకు అమలు చేయరని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో వసూలయ్యే ఆదాయమంతా తెలంగాణకు వెళ్తుంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ కు సమస్య రావద్దనే ప్రత్యేక హోదా హామీనిచ్చాను. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ, అతని సహచరులతో చర్చించాకే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రకటించాం. ప్రభుత్వం అనేది నిరంతర ప్రవాహం లాంటిది. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలపై ఉంది. సభలో ఇచ్చిన మాటను అంతా గౌరవించాలి. అప్పుడే ప్రజలకు చట్టాలపై, ప్రభుత్వాలపై నమ్మకం, గౌరవం ఏర్పడుతుందని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.