రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సభ తరపున, తన తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. పరిపాలనా అనుభవం ఉన్న దేశంలోని దీర్ఘ కాల నాయకులలో మల్లికార్జున్ ఖర్గే ఒకరు అని వెంకయ్య పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇటీవల కాలం వరకు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆజాద్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో ఖర్గే పేరును కాంగ్రెస్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే మొదటినుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఖర్గే గతంలో (2014-19) లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లోఆయన ఓడిపోవడంతో.. మరలా కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ రాజ్యసభలో భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.
The second phase of the Budget session of Parliament commences with reconvening of Rajya Sabha in the first half of the day pic.twitter.com/uggcTp9m1o
— ANI (@ANI) March 8, 2021